Housing sales : హైదరాబాద్‌లో 24 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు.. 8 నగరాల్లో ఇలా..
Housing sales in hyderabad: హైదరాబాద్‌లో హౌజింగ్ సేల్స్ ఇతర నగరాలతో పోల్చితే చాలా తక్కువగా పెరిగాయి.
న్యూఢిల్లీ, జూలై 6: ఇళ్ల అమ్మకాలు (Housing sales) ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో అంటే జనవరి నుంచి జూన్ వరకు దేశంలోని 8 నగరాల్లో 1,58,705 యూనిట్లు అమ్ముడయినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా (Knight Frank India) వెల్లడించింది. గడిచిన 9 ఏళ్లలో ఇదే అత్యధిక వృద్ధి రేటు నమోదైన అర్ధ సంవత్సరమని తెలిపింది. లోయర్ బేస్ ప్రైస్, చౌక వడ్డీ రేట్లు ఇందుకు దోహదపడ్డాయని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది.
2021లో మొదటి ఆరు నెలల్లో 99,416 యూనిట్లు Housing sales అమ్ముడయ్యాయని నైట్ ఫ్రాంక్ తన 17వ ఎడిషన్ హాఫ్ ఇయర్లీ రిపోర్ట్ ‘ఇండియా రియల్ ఎస్టేట్: రెసిడెన్షియల్, ఆఫీస్ మార్కెట్ 2022 హెచ్ 1’ నివేదికలో తెలిపింది. ఈ నివేదికను బుధవారం ఒక వెబినార్‌లో విడుదల చేసింది.
రెసిడెన్షియల్ సెక్టార్ 9 ఏళ్లతో పోలిస్తే ఈ అర్ధ సంవత్సరంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసిందని, 2013 మొదటి అర్ధ సంవత్సరంలో కూడా 1,85,577 ఇళ్లు అమ్ముడయ్యాయని విశ్లేషించింది.
కోవిడ్ పూర్వం కంటే ఇళ్ల ధరలు చవకగా ఉండడం, చౌకైన హోమ్ లోన్స్ ఉండడం, వినియోగదారులు తమ జీవనశైలిని మెరుగుపరుచుకోవాలనుకోవడం ఈ సేల్స్‌కు కారణమని విశ్లేషించింది. కోవిడ్ మహమ్మారి కూడా కొనుగోలుదారులను ప్రోత్సహించిందని వివరించింది. గత ఏడాదితో పోలిస్తే ఇళ్ల ధరలు 3 నుంచి 9 శాతం పెరిగాయని నివేదిక తెలిపింది.
కోవిడ్ భయాలు, ద్రవ్యోల్భణ ఆందోళనలు ఉన్నప్పటికీ ఇళ్ల కొనుగోలులో పటిష్టమైన వృద్ధి కనిపించిందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ వివరించారు.
నగరాల వారీగా housing sales ఇలా..
హైదరాబాద్ నగరంలో హౌజింగ్ సేల్స్‌లో గత ఏడది జనవరి - జూన్ తో పోలిస్తే ఈ ఏడాది ఫస్ట్ హాఫ్‌లో 23 శాతం వృద్ధి కనిపించింది. పోయిన ఏడాది ఇదేకాలంలో11,974 ఇళ్లు అమ్ముడవగా, ఈ ఏడాది ఫస్ట్ హాఫ్‌లో 14,693 ఇళ్లు అమ్ముడుపోయాయి. నిజానికి ఇతర నగరాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ వృద్ధిగా చెప్పుకోవచ్చు.
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ముంబై నగరంలో ఇళ్ల అమ్మకాలు 55 శాతం పెరిగాయి. జనవరి-జూన్ 2022 కాలంలో 44,200 యూనిట్లు అమ్ముడుపోయాయి.
ఇక ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో Housing sales రెండు రెట్లకు పైగా పెరిగాయి. గత ఏడాది మొదటి అర్థ సంవత్సరంలో 11,474 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది ఇదే కాలంలో 29,101 యూనిట్లు అమ్ముడుపోయాయి.
బెంగళూరులో ఇళ్ల అమ్మకాల్లో 80 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది 14,812 యూనిట్లు అమ్ముడవగా ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో 26,677 యూనిట్లు అమ్ముడయ్యాయి.
ఇక పూణే సిటీలో 25 శాతం వృద్ధి కనిపించింది. అంతకుముందు ఏడాది 17,474 యూనిట్లు అమ్ముడవగా ఈ ఏడాది ఫస్ట్ హాఫ్‌లో 21,797 ఇళ్లు అమ్ముడుపోయాయి.
చెన్నై నగరంలో Housing sales 21 శాతం వృద్ధి నిపించింది. 2021 జనవరి-జూన్ మధ్య 5,751 ఇళ్లు అమ్ముడవగా, ఈ ఏడాది ఫస్ట్ హాఫ్‌లో 6,951 ఇళ్లు అమ్ముడుపోయాయి.
కోల్‌కతా నగరంలో హౌజింగ్ సేల్స్‌లో 39 శాతం వృద్ధి కనిపించింది. 5,115 యూనిట్ల నుంచి 7,090 యూనిట్లకు పెరిగాయి.
ఈ ఏడాది జనవరి-జూన్ కాలంలో అహ్మదాబాద్‌లో హౌౌజింగ్ సేల్స్‌లో 95 శాతం పెరుగుదల కనిపించింది. 4,208 యూనిట్ల నుంచి 8,197 యూనిట్లకు పెరిగాయి.
ఇక సప్లై వైపు చూస్తే కొత్త లాంఛ్‌ల ద్వారా 56 శాతం మేర పెరిగి 1,60,806 యూనిట్లకు చేరాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 80,566 మాత్రమే లాంఛ్ అయ్యాయి.
కాగా హౌజింగ్ సేల్స్‌లో భారీ వృద్ధి నమోదు కావడంతో అమ్ముడుపోని ఇళ్ల ఇన్వెంటరీ కొద్దిగా తగ్గి 4,40,117 యూనిట్లు ఉంది.
అమ్ముడుపోని ఇన్వెంటరీని అమ్మేందుకు ఇంతకుముందు 10.9 త్రైమాసికాల కాలం ఎదురుచూడాల్సి వస్తే.. అది ఇప్పుడు 8 త్రైమాసికాలకు తగ్గిందని నైట్ ఫ్రాంక్ విశ్లేషించింది.
‘2022 హెచ్1 సమయంలో ఆఫీస్ మార్కెట్ అందించిన బలమైన పనితీరు 2022కి ట్రెండ్‌ను సెట్ చేసింది. మరిన్ని కంపెనీలు తమ ఉద్యోగులు తిరిగి కార్యాలయానికి రావాలని కోరుకుంటున్నందున ఫిజికల్ ఆక్యుపెన్సీ స్థాయిలు పెరుగుతున్నాయి’ అని బైజల్ చెప్పారు. 2022 హెచ్ 1లో ఆఫీస్ స్పేస్‌లో 61 శాతం వృద్ధి కనిపించిందని తెలిపారు.
బెంగుళూరు, పూణె ఆఫీస్ మార్కెట్‌లు అద్దె విలువలో వరుసగా 13 శాతం, 8 శాతం చొప్పున గరిష్ట వార్షిక పెరుగుదలను నమోదు చేశాయి.
హైదరాబాద్, ముంబయి, ఎన్‌సిఆర్-ఢిల్లీ అద్దె విలువలు మధ్యస్థంగా పెరిగాయి. చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతాలో అద్దె విలువలు స్థిరంగా ఉన్నాయి.