Holi horror: హోలీ రోజు రెండు హత్యలు; భార్య గొంతు కోసి దారుణ హత్య; మరో ఘటనలో ప్రియురాలి మాజీ భర్త హత్య
Holi horror: హోలీ రోజు దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల గొడవ ఒక నిండు ప్రాణం తీసింది. ఆవేశంతో ఒక వ్యక్తి భార్య గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ దారుణం సోమవారం సాయంత్రం ఢిల్లీలో చోటు చేసుకుంది.
Holi horror: హోలీ రోజు ఓ వ్యక్తి తన భార్య గొంతు కోసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. అలీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బక్తవార్ పూర్ లోని బల్దావర్ కాలనీలో సోమవారం దేశమంతా హోలీ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఈ హత్య జరిగింది.
దారుణంగా గొంతు కోసి..
నిందితుడిని మంజీత్ గా, మృతురాలిని ఆర్తిగా పోలీసులు గుర్తించారు. 176 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద చర్యలు తీసుకోవాలని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం 6.50 గంటలకు ఢిల్లీ పోలీసులకు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ వచ్చింది. ఓ మహిళను ఆమె భర్త తీవ్రంగా కొట్టాడని ఫోన్ చేసిన వ్యక్తి వారికి సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా మహిళ ఆర్తి గొంతు కోసి రక్తపు మడుగులో పడి ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడైన భర్తను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆరేళ్ల క్రితం వివాహం
ఈ జంటకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. మృతురాలికి మూడు, ఐదేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిందితుడిపై ఐపీసీ 302, 304బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హోలీ రోజు మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు భావిస్తున్నారు.
తుపాకీతో కాల్చి చంపి..
ఇదే రోజు ఢిల్లీలో మరో హత్య జరిగింది. వాగ్వాదం జరుగుతుండగా కోపంతో ఒక వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ముస్తాకిమ్ అనే వ్యక్తిని యాసీన్ అనే వ్యక్తి కాల్చి చంపాడు. నిందితుడు యాసీన్ పరారీలో ఉన్నాడని, అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ‘‘ముస్తాకిమ్ ఛాతీపై కాల్పులు జరిపారు. అతన్ని జగ్ ప్రవేశ్ చంద్ర ఆసుపత్రికి తరలించాము. అక్కడ అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీటీబీ ఆస్పత్రికి తరలించాము’’ అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య) జాయ్ టిర్కీ తెలిపారు.
ప్రియురాలి మాజీ భర్త హత్య
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాకిమ్, సొహైల్ స్నేహితులు. సొహైల్ కు గతంలో ఇష్రత్ తో పెళ్లి అయింది. విబేధాల కారణంగా వారు ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. ఇష్రత్ బార్ లో పని చేస్తుంటుంది. ఇష్రత్ ప్రస్తుతం యాసీన్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది. సోమవారం రాత్రి తన స్నేహితుడు సోహైల్ కలిసి ముస్తాకిమ్ తన మాజీ భార్య ఇష్రత్ ఇంటికి వెళ్లాడు. అక్కడ వారికి యాసీన్ కనిపించాడు. వారి మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. అది పెద్దదై తీవ్రస్థాయి ఘర్షణగా మారింది. ఆవేశానికి లోనైన యాసీన్ ముస్తాకిమ్ ను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయడు.