Bomb threat at Google office : గూగుల్​ కార్యాలయానికి బాంబు బెదిరింపు.. హైదరాబాదీ అరెస్ట్​-hoax bomb threat at google office in pune caller held in hyderabad ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Hoax Bomb Threat At Google Office In Pune; Caller Held In Hyderabad

Bomb threat at Google office : గూగుల్​ కార్యాలయానికి బాంబు బెదిరింపు.. హైదరాబాదీ అరెస్ట్​

Sharath Chitturi HT Telugu
Feb 13, 2023 01:01 PM IST

Bomb threat at Google office : పుణెలోని గూగుల్​ కార్యాలయంలో బాంబు ఉందని ఓ వ్యక్తి ఫోన్​ చేయగా.. అధికారులు పరుగున వెళ్లి తనిఖీలు నిర్వహించారు. చివరికి అందులో బాంబు లేదని తేలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

గూగుల్​ కార్యాలయానికి బాంబు బెదిరింపు
గూగుల్​ కార్యాలయానికి బాంబు బెదిరింపు (Reuters)

Bomb threat at Google office : మహారాష్ట్ర పుణెలో ఉన్న గూగుల్​ కార్యాలయంలో బాంబు బెదిరింపు ఫోన్​ కాల్​ కలకలం సృష్టించింది. ఫోన్​ కాల్​తో అధికారులు అప్రమత్తమై.. తనిఖీలు చేపట్టారు. బాంబు లేదని తెలుసుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాంబు ఉందని ఫోన్​ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. అతను హైదరాబాద్​లో నివాసముంటున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

ముంబైలోని బాంద్రా కుర్ల కాంప్లెక్స్​లో గూగుల్​ కార్యాలయం ఉంది. కాగా.. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో.. ఆ ఆఫీస్​కు ఓ ఫోన్​కాల్​ వచ్చింది. కంపెనీకి చెందిన పుణె కార్యాలయంలో బాంబు ఉన్నట్టు ఓ వ్యక్తి చెప్పాడు. సంబంధిత వ్యక్తులు అధికారులకు ఈ విషయాన్ని వివరించారు.

పుణె ముంద్వా ప్రాంతంలోని ఓ కమర్షియల్​ బిల్డింగ్​లోని 11వ అంతస్తులో ఉంది గూగుల్​ కార్యాలయం. ముంబై అధికారులు.. పుణెలోని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. గూగుల్​ కార్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాంబ్​ స్క్వాడ్​తో ఆ ప్రాంతం మొత్తాన్ని పరిశీలించారు. చివరికి అదొక ఫేక్​ కాల్​ అని, కార్యాలయంలో బాంబు లేదని తేలింది.

ఘటనను తీవ్రంగా పరిగణించిని పోలీసులు.. బాంబు ఉందని ఫోన్​ చేసిన వ్యక్తిని ట్రేస్​ చేసేండుకు ప్రయత్నించారు. అతను హైదరాబాద్​వాసి అని తెలుసుకున్నారు. అతడిని పట్టుకుని అరెస్ట్​ చేశారు. అతని పేరు ప్రణయం బాబు శివానంద్​ అని తెలుస్తోంది. మద్యం మత్తులో ముంబై కార్యాలయానికి ఫోన్​ చేసి అసభ్యకరంగా మాట్లాడినట్టు సమాచారం. 

ఈ వ్యవహారంపై సెక్షన్​ 505(1)(బీ), 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిపై విచారణనను ముమ్మరం చేశారు.

కొందరు ఫేక్​ కాల్​ చేసి.. బాంబు ఉందని అధికారులను భయపెట్టించి, పరుగులు తీయిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగాయి. రద్దీ ప్రాంతాల్లో, రైళ్లు, విమానాల్లో బాంబులు ఉన్నట్టు చెప్పి అందరిని భయాందోళనకు గురిచేస్తున్నారు.

IPL_Entry_Point