Himachal Pradesh elections : హిమాచల్​ ఫలితాలపై బీజేపీ ‘ఫోకస్’​.. కసరత్తులు షురూ!-himachal pradesh elections news bjp leadership huddles in dharamshala to assess post poll scenario ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Himachal Pradesh Elections News, Bjp Leadership Huddles In Dharamshala To Assess Post-poll Scenario

Himachal Pradesh elections : హిమాచల్​ ఫలితాలపై బీజేపీ ‘ఫోకస్’​.. కసరత్తులు షురూ!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 05, 2022 01:18 PM IST

Himachal Pradesh elections : హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికల ఫలితాలు ఈ నెల 8న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ కసరత్తులు మొదలుపెట్టేసింది.

సమావేశంలో పాల్గొన్న హిమాచల్​ ప్రదేశ్​ బీజేపీ నేతలు
సమావేశంలో పాల్గొన్న హిమాచల్​ ప్రదేశ్​ బీజేపీ నేతలు (HT_PRINT)

Himachal Pradesh elections : గుజరాత్​ ఎన్నికలు ముగింపు దశకు చేరుకోవడంతో ఇప్పుడు ఫోకస్​ మళ్లీ హిమాచల్​ ప్రదేశ్​పై పడింది! గుజరాత్​లో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతుందని అంచనాలు ఉండగా.. హిమాచల్​ ప్రదేశ్​లో మాత్రం ఓటర్ల నాడి సరిగ్గా తెలియడం లేదు. పైగా.. ఆనవాయతీ ప్రకారం ఐదేళ్లకోసారి అధికారం మారుతూ ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకున్న పార్టీలు.. ఇప్పటికే పావులు కదపడం మొదలుపెట్టాయి. ఇందులో బీజేపీ ముందు వరుసలో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

బీజేపీ అగ్రనేతలు, పార్టీ అభ్యర్థులు ఆదివారం సాయంత్ర ధర్మశాలలో సమావేశమయ్యారు. ఫలితాలను ఏ విధంగా తీసుకోవాలి? ఆ తర్వాత ఏ విధంగా వ్యవహరించాలని సమాలోచనలు చేశారు.

Himachal Pradesh election BJP : ధర్మశాలలో జరిగిన సమావేశానికి హిమాచల్​ ప్రదేశ్​ బీజేపీ అధ్యక్షుడు సురేశ్​ కశ్యప్​ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు సౌదన్​ సింగ్​, ముఖ్యమంత్రి జైరామ్​ ఠాకూర్​, మాజీ ఎంపీ అవినాశ్​ రాయ్​ కన్నా, సంజయ్​ ఠండన్​, దేవేందర్​ రాణాతో పాటు ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.

హిమాచల్​లో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉంది. కానీ రాష్ట్ర​ ఎన్నికలు ఎప్పుడూ ఉత్కంఠంగానే ఉంటాయి. 1985 తర్వాత ఇక్కడ ఒక పార్టీ వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టిన పరిస్థితి లేదు. ఈ పరిణామాల మధ్య స్వతంత్రులు కీలకంగా మారారు. రెబెల్స్​ కూడా అంతే ముఖ్యంగా ఉన్నారు. వీరిని ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ఇప్పటికే అడుగులు వేసినట్టు కనిపిస్తోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్​- బీజేపీ మధ్య పోరు తీవ్రంగా ఉంటుందని కమలదళం భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా.. 2017 ఎన్నికల్లో వచ్చిన సీట్ల(44) కన్నా ఇప్పుడు తక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉంటుందని కమదళంలోనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో రెబల్స్​ తిరుగుబాటు చేయడం కూడా పార్టీకి చేటు చేసిందని నేతలు ఫిర్యాదులు చేస్తున్నట్టు సమాచారం. మొత్తం 21మంది నేతలు తిరుగుబాటు చేయగా.. వీరిలో 12మందికి.. ఫలితాలను తారుమారు చేసే శక్తి ఉందని తెలుస్తోంది.

Himachal Pradesh election results : ప్రవీణ్​ శర్మ, రామ్​ సింగ్​, విపిన్​ నిహారియా, సుభాష్​ శర్మ, క్రిపాల్​ పార్మర్​, హోషియార్​ సింగ్​ దెహ్రా, ఇందిరా కపూర్​, హితేష్​వర్​ సింగ్​, రాజ్​కుమార్​ కౌండల్​ వంటి ప్రముఖుల పేర్లు రెబల్స్​ లిస్ట్​లో ఉంది. ఆసక్తికర విషయం ఏం అంటే.. రెబల్స్​ పోటీ చేసిన స్థానాల్లో.. ఓటింగ్​ శాతం భారీగా నమోదైంది.

ఏదిఏమైనా.. గెలుపు తమదే అని బయటకు ధీమాగా చెబుతోంది బీజేపీ.

"హిమాచల్​ ప్రదేశ్​లో 'అనవాయతీ'కి బ్రేక్​ పడుతుంది. ఈసారి కూడా కమలదళానిదే అధికారం. సమావేశంలో పాల్గొన్న అభ్యర్థులు కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. గెలుపోటముల మధ్య వ్యత్యాసం పెద్దగా ఉండకపోవచ్చు. మా బాధ్యతను మేము నిర్వర్తించాము. ఫలితాలు వెలువడేంత వరకు వేరే అంశాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు," అని జైరామ్​ తెలిపారు.

68 అసెంబ్లీ సీట్లున్న హిమాచల్​ ప్రదేశ్​తో పాటు గుజరాత్​ ఎన్నికల ఫలితాలు ఈ నెల 8న వెలువడనున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం