High-speed driving: ‘అతివేగంగా వాహనాన్ని నడపడాన్ని ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ అనలేం’: ఢిల్లీ హైకోర్టు-highspeed driving may not necessarily be rash and negligent delhi hc ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  High-speed Driving: ‘అతివేగంగా వాహనాన్ని నడపడాన్ని ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ అనలేం’: ఢిల్లీ హైకోర్టు

High-speed driving: ‘అతివేగంగా వాహనాన్ని నడపడాన్ని ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ అనలేం’: ఢిల్లీ హైకోర్టు

Sudarshan V HT Telugu

అతివేగంగా వాహనాన్ని నడపడాన్ని ర్యాష్ డ్రైవింగ్ అని కానీ, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ అని కానీ అనలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. 2012లో ఇద్దరు పాదచారులను కారుతో ఢీ కొట్టి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పిటిషనర్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఢిల్లీ హైకోర్టు

High-speed driving: 2012లో కారుతో ఢీ కొట్టి ఇద్దరు పాదచారులను హత్య చేసిన కేసులో నిందితుడైన పిటిషనర్ ను నిర్దోషిగా పేర్కొంటూ హైస్పీడ్ డ్రైవింగ్ కేసు అంటే డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించాడని అర్థం కాదని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. 2022లో తనకు విధించిన 18 నెలల జైలు శిక్షను సవాలు చేస్తూ కారు క్లీనర్ అయిన పిటిషనర్ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. రైడ్ కోసం వాహనాన్ని బయటకు తీశానని, టైర్ పేలడంతో అదుపు తప్పి ఇద్దరు పాదచారులను ఢీ కొట్టానని ఆ పిటిషనర్ వివరించాడు.

టైర్ పేలడంతో..

అకస్మాత్తుగా టైరు పేలడంతో కారుపై తాను నియంత్రణ కోల్పోయానని ఆ వ్యక్తి తన పిటిషన్ లో పేర్కొన్నాడు. నిందితుడు కారును అతివేగంతో నడుపుతున్నాడని, అయితే, అది ర్యాష్ డ్రైవింగ్ అనలేమని సాక్షుల వాంగ్మూలాలను జస్టిస్ బెనర్జీ పరిగణనలోకి తీసుకున్నారు. నలుగురు సాక్షుల వాంగ్మూలాలను హైకోర్టు పరిశీలించింది. నిందితుడు కారును అతివేగంతో నడిపారని వారంతా చెబుతున్నప్పటికీ, ఆ వ్యక్తి "కారును ర్యాష్ గా లేదా నిర్లక్ష్యంగా" నడిపినట్లు వారెవరూ నిర్ధారించలేకపోయారు. పిటిషనర్ ర్యాష్ గా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నాడని నిర్ధారణకు రావడానికి కేవలం హైస్పీడ్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకోలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ప్రాసిక్యూషన్ లోపం

ఈ కేసులో లోపాలకు ప్రాసిక్యూషన్ కారణమని, అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇద్దరు పాదచారులను పొట్టనబెట్టుకున్నాడని ప్రాసిక్యూషన్ నిస్సందేహంగా నిరూపించలేకపోయారని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రమాద సమయం, వాహనం పరిస్థితి, పిటిషనర్ చెప్పినట్లు ఫ్లాట్ టైర్ వంటి సందర్భోచిత అంశాలను ప్రాసిక్యూషన్ పరిగణనలోకి తీసుకోలేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఒక మరణానికి లేదా గాయానికి కారణమయ్యే నిందితుడి చర్య "తొందరపాటు" లేదా "నిర్లక్ష్య" ప్రవర్తన కారణంగా ఉండాలని న్యాయమూర్తి వివరించారు. పిటిషనర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా కారు నడుపుతున్నాడనడానికి ఈ కోర్టుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొంది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.