How to check bank balance using Aadhaar : ఆధార్​తో బ్యాంకు బ్యాలెన్స్​ ఎలా తెలుసుకోవాలి?-heres how to check bank balance using aadhaar card ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Heres How To Check Bank Balance Using Aadhaar Card

How to check bank balance using Aadhaar : ఆధార్​తో బ్యాంకు బ్యాలెన్స్​ ఎలా తెలుసుకోవాలి?

Sharath Chitturi HT Telugu
Sep 03, 2022 01:02 PM IST

How to check bank balance using Aadhaar card : ఆధార్​ కార్డుతో బ్యాంకు బ్యాలెన్స్​ చెక్​ చేసుకోవచ్చు. అది ఎలా అంటే..

ఆధార్​తో బ్యాంకు బ్యాలెన్స్​ ఎలా తెలుసుకోవాలి?
ఆధార్​తో బ్యాంకు బ్యాలెన్స్​ ఎలా తెలుసుకోవాలి? (Mint)

How to check bank balance using Aadhaar card : ఆధార్​ కార్డు లేనిదే ఇప్పుడు దేశంలో ఏ పని జరగడం లేదు! మొబైల్​ నెంబర్​, బ్యాంక్​ అకౌంట్​, పాన్​ కార్డు.. ఇలా అన్నింటికీ ఈ ఆధార్​ కార్డు లింక్​ అయిపోయింది. ఇందులో మీ వ్యక్తిగత వివరాలు ఉంటాయి. మీ బయోమెట్రిక్​ ఫింగర్​ప్రింట్​ కూడా ఈ ఆధార్​ లింక్​ చేసి ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. అయితే.. ఈ 12 అంకెల ఆధార్​ కార్డు నెంబర్​తో బ్యాంకు బ్యాలెన్స్​ తెలుసుకోవచ్చని మీకు తెలుసా? 

ట్రెండింగ్ వార్తలు

స్మార్ట్​ఫోన్​ ఉపయోగించలేని వృద్ధులకు ఈ ఆప్షన్​ ఎంతో ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్​ కనెక్షన్​ లేనప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. కేవలం నాలుగు స్టెప్స్​తోనే ఆధార్​ కార్డుతో బ్యాంకు బ్యాలెన్స్​ తెలుసుకోవచ్చు.

ఆధార్​ కార్డుతో బ్యాంక్​ బ్యాలెన్స్​ తెలుసుకోవడం ఎలా అంటే..

  • స్టెప్​ 1:- మీ రిజిస్టర్డ్​ మొబైల్​ నెంబర్​ మీద *99*99*1# కి డైల్​ చేయండి.
  • స్టెప్​ 2:- 12 డిజిట్​ ఆధార్​ కార్డు నెంబర్​ టైప్​ చేయిండి.
  • స్టెప్​ 3:- ఆధార్​ కార్డు నెంబర్​ను వెరిఫై చేసుకోండి.
  • స్టెప్​ 4:- యూఐడీఏఐ నుంచి మీకు ఒక ఫ్లాష్​ ఎస్​ఎంఎస్​ వస్తుంది. అందులో మీ బ్యాంకు బ్యాలెన్స్​ వివరాలు ఉంటాయి.

Aadhaar card bank balance : ఆధార్​ కార్డుతో బ్యాంకు బ్యాలెన్స్​ చెక్​ చేసుకోవడమే కాకుండా.. మనీ ట్రాన్స్​ఫర్​, పాన్​ కార్డు అప్లై చేసుకోవడం వంటి పనులు కూడా చేయవచ్చు!

మరోవైపు ఇంటింటికి వెళ్లి.. ఫోన్​ నెంబర్​ను ఆధార్​ కార్డుకు లింక్​ చేసే ప్రక్రియను చేపట్టాలని యూఐడీఏఐ భావిస్తోంది. ఇందుకోసం సన్నద్ధమవుతోంది. ఫలితంగా.. మీరు ఆధార్​ సేవా కేంద్రానికి వెళ్లాల్సిన పని కూడా ఉండదు!

ఆధార్​ వివరాలను ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..?

Aadhaar details update : ఆధార్​లో మన వ్యక్తిగత వివరాలను సరిగ్గా పొందుపరచడం ఎంతో ముఖ్యం. మరి ఆధార్​లోని వివరాలను ఎన్నిసార్లు మార్చుకునే అవకాశం ఉంటుంది?

ఆధార్​లో పేరు..

ఆధార్​ కార్డులో పేరును రెండుసార్లు మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.

డేట్​ ఆఫ్​ బర్త్​ వివరాలు..

ఆధార్​ కార్డులో డేట్​ ఆఫ్​ బర్త్​ వివరాలను కేవలం ఒక్కసారి మాత్రమే అప్డేట్​ చేసుకునేందుకు వీలు ఉంటుంది. "కొన్ని సందర్భాల్లో ప్రత్యేక వెసులుబాటు ఉంటుంది. ఆధార్​ సెంటర్​లో అప్డేట్​ కోసం రిక్వెస్ట్​ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత సంబంధిత యూఐడీఏఐ రీజనల్​ ఆఫీసుకు వెళ్లి ఆమోదం పొందవచ్చు. కొన్ని చెక్కింగ్​ల తర్వాత ఆమోదం లభిస్తుంది," అని యూఐడీఏఐ చెప్పింది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్