Stocks to buy : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి 6 స్టాక్స్​ ఇవే..!-here is the list of 6 stocks to buy or sell today on august 5 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Here Is The List Of 6 Stocks To Buy Or Sell Today On August 5

Stocks to buy : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి 6 స్టాక్స్​ ఇవే..!

Sharath Chitturi HT Telugu
Aug 05, 2022 08:29 AM IST

Stocks to buy : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి 6 స్టాక్స్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సి నేటి 6 స్టాక్స్​ ఇవే..!
ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సి నేటి 6 స్టాక్స్​ ఇవే..! (Mint)

Stocks to buy : దేశీయ స్టాక్​ మార్కెట్​లో గురువారం తీవ్ర ఒడిగొడుకుల సెషన్​ నమోదైంది. సెన్సెక్స్​, నిఫ్టీలు చివరికి ఫ్లాట్​గా ముగిశాయి. నిఫ్టీ.. 6 పాయింట్ల నష్టంతో 17,382 వద్ద స్థిరపడింది. 51పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్​.. 58,298 వద్ద ముగిసింది.

ట్రెండింగ్ వార్తలు

నిఫ్టీలోని మెటల్స్​, ఐటీ, హెల్త్​కేర్​ సెక్టార్లు గురువారం సెషన్​లో రాణించాయి. రియల్టీ, టెలికాం సూచీలు పతనయ్యాయి.

తీవ్ర ఒడిదొడుకుల సెషన్​ నమోదైనప్పటికీ.. నిఫ్టీ ఇంకా అప్​ట్రెండ్​లోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్​లో రివర్సల్​ వచ్చే సూచనలు టెక్నికల్​గా కనిపించడం లేదన్నారు. అయితే.. మరో 2-3 సెషన్ల వరకు ఒడిదొడుకులు ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీకి.. 17,200 మార్క్​ వద్ద సపోర్ట్​ ఉందని, 17,500 వద్ద బలమైన రెసిస్టెన్స్​ ఉందని చెబుతున్నారు.

ఇక ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్ ఇవే​..

  • సిప్లా:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​- రూ. 1015, టార్గెట్​ రూ. 1075- రూ. 1090
  • మారికో:- బై కరెంట్​ మార్కెట్​ ప్ర్​జ్​, స్టాప్​ లాస్​- రూ. 520, టార్గెట్​ రూ. 540-550
  • దివిస్​ ల్యాబ్స్​:- బై రూ. 3890, స్టాప్​ లాస్​- రూ. 3810, టార్గెట్​- రూ. 4150
  • లారస్​ ల్యాబ్స్​:- బై రూ. 544, స్టాప్​ లాస్​- రూ.530 టార్గెట్​ రూ. 565
  • వోల్టాస్​:- బై రూ. 1000, స్టాప్​ లాస్​- రూ. 975, టార్గెట్​ రూ. 1050
  • విప్రో:- బై రూ. 435, స్టాప్​ లాస్​ రూ. 420, టార్గెట్​ రూ. 460

(గమనిక:- ఇవి నిపుణుల సలహాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ట్రేడింగ్​ చేసే ముందు.. సొంతంగా ఎనాలసిస్​ చేసుకోవడం శ్రయేసర్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం