Public speaking : అందరి ముందు మాట్లాడటానికి భయపడుతున్నారా? ఈ యాప్స్‌తో స్కిల్ పెంచుకోండి..
Free Public speaking apps : మీకు పబ్లిక్ స్పీకింగ్‌లో ఇబ్బందులు ఉన్నాయా? ఈ స్కిల్‌ను మెరుగుపరుచుకుందామని చూస్తున్నారా? అయితే ఈ యాప్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే!
Free Public speaking apps : కొందరు గడగడా మాట్లాడేస్తుంటారు. స్టేజ్ ఎక్కడం ఆలస్యం.. వారి మాటలకు హద్దులు లేకుండా పోతాయి. ఇంకొందరు.. వీరికి పూర్తిగా డిఫరెంట్! స్టేజ్ ఎక్కడం కాదు కదా.. గుంపులో, తెలిసి వారి మధ్యలో ఉన్నా మాట్లాడలేరు. పబ్లిక్ స్పీకింగ్ అంటే వీరికి చాలా భయం. మరి వీరిలో మీరూ ఒకరా? మీ భయాన్ని పోగొట్టుకుని, అందరి ముందు మీ తెలివితేటలను ప్రదర్శించాలని భావిస్తున్నారు? అయితే ఇది మీకోసమే. కొన్ని ఫ్రీ యాప్స్‌తో మీరు సులభంగా మీ భయాన్ని పోగొట్టుకోవచ్చు..
పబ్లిక్ స్పీకింగ్ టిప్స్..
స్పీచ్‌లు ఇచ్చే ముందు.. మనం ఎవరి ముందు మాట్లాడుతున్నామన్నది కచ్చితంగా తెలుసుకోవాలి. అందుకు తగ్గట్టు స్పీచ్‌ని ప్లాన్ చేసుకోవాలి. 20ఏళ్ల యువత ఉన్న గ్రూప్‌లో 70ఏళ్ల వయస్సుకు సంబంధించిన విషయాలు మాట్లాడితే ఇంట్రెస్టింగ్గా ఉండదు. అందుకే.. రిలేటెబుల్ స్పీచ్‌లను తయారు చేసుకోవాలి.
అసలు మీరు ఎందుకు స్పీచ్ ఇస్తున్నారు? అనే విషయంపై మీకు క్లారిటీ ఉండాలి. మీకంటు ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి. దాని చుట్టూ.. మీ స్పీచ్‌ను తయారు చేసుకోవాలి.
ఇదీ చూడండి:- Python learning apps : రూ. లక్షల్లో జీతం ఇచ్చే టెక్ జాబ్ కావాలా? ఇలా ‘పైథాన్’ నేర్చుకోండి!
ఏది ఏమైనా, ఎన్ని చేసినా.. ప్రాక్టీస్‌తోనే విజయం సాధిస్తాము అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ప్రిపేర్ అవుతూనే ఉండాలి. అనుకున్న ఫలితాలు రాకపోయినా, గోల్ సాధించేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి.
పబ్లిక్ స్పీకింగ్ యాప్స్..
మీరు ప్రాక్టీస్ చేసుకునేందుకు సులభంగా ఉండే కొన్ని పబ్లిక్ స్పీకింగ్ యాప్స్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
Metronome App:- ఇదొక ఫ్రీ ఇంటరాక్టివ్ యాప్. దినిని కొందరు మ్యుజీషియన్స్ తయారు చేశారు. మిమ్మల్ని మీరు వేగంగా ట్రైన్ చేసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.
ELSA:- ఇంగ్లీష్‌ను అనర్గళంగా మాట్లాడాలన్నది మీ గోల్ అయితే.. ఈ యాప్ బెస్ట్! కృత్రిమ మేథను ఉపయోగించుకునే ఈ యాప్‌లో వాయిస్ రికగ్నీషన్ ఫీచర్స్ ఉన్నాయి. ఉచ్చారణతో పాటు ఫ్లూయెన్సీలో మీకు సాయం లభిస్తుంది.
Rev Audio and Voice recorder:- మీ వాయిస్‌ని, స్పీచ్‌ని ఎనాలసిస్ చేసుకునేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుంది. వేగంగా ఎలా మెరుగుపడాలి? అన్న టిప్స్ ఇస్తుంది.
Orai:- ఇదొక ఫేమస్ యాప్. వాయిస్ రికగ్నీషన్ టెక్నాలజీ ద్వారా మీ స్పీచ్‌ను మెరుగుపరుచుకునేందుకు ఈ యాప్ సాయం చేస్తుంది. పర్సనల్ కోచ్‌గా కూడా ఈ యాప్ వ్యవహరిస్తుంది. ఇది కాస్ట్ ఎఫెక్టివ్ కూడా!
సంబంధిత కథనం