ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన ప్రైవేట్ చాపర్; ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీ సోదరి సహా ఆరుగురి మృతి-helicopter crashes near bhagirathi river in uttarakhands uttarkashi 5 dead ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన ప్రైవేట్ చాపర్; ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీ సోదరి సహా ఆరుగురి మృతి

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన ప్రైవేట్ చాపర్; ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీ సోదరి సహా ఆరుగురి మృతి

Sudarshan V HT Telugu

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గంగోత్రి వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోవడంతో ఆరుగురు మరణించగా, మరోకరు గాయపడ్డారు. మరణించిన వారిలో ఏపీ ఎంపీ అంబిక లక్ష్మినారాయణ సోదరి వేదవతి కూడా ఉన్నారు.

కుప్పకూలిన గంగోత్రి వెళ్తున్న ప్రైవేట్ చాపర్

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో ఉదయం 9 గంటల ప్రాంతంలో గంగోత్రి వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోవడంతో ఆరుగురు మరణించారు. మరోకరు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మి నారాయణ సోదరి వేదవతి కుమారి మరణించారు. ఆమె భర్త భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను రిషికేష్ లోని ఎయిమ్స్ కు తరలించారు.

సహాయ చర్యలు

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మరియు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, హుటాహుటిన సహాయ చర్యలు ప్రారంభించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, హెలీకాప్టర్ లో దాదాపు ఏడుగురు ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. వారిలో ఆరుగురు ఘటనా స్థలంలోనే మరణించగా, ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

సహాయ చర్యలు

సమాచారం తెలియగానే పోలీసులు, సైనిక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందం, అంబులెన్స్, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉత్తరకాశి జిల్లాలోని భాగీరథ నది సమీపంలో హెలికాప్టర్ కూలిపోయిన వార్తను గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ధృవీకరించారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.