భారత వాతావరణ శాఖ (IMD) మే 24న విడుదల చేసిన వాతావరణ బులెటిన్ ప్రకారం, దేశంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే, ఉత్తర భారత్, వాయవ్య భారత్ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల వాతావరణం నెలకొని ఉంటుంది. ఈ ఏడాది దేశం విభిన్న వాతావరణ దృగ్విషయాలను చూస్తోంది.
మరోవైపు, దక్షిణ కొంకణ్ తీరంలో తూర్పు మధ్య అరేబియా సముద్రంపై అల్పపీడనం ఏర్పడింది. అది తూర్పు మధ్య అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కొంకణ్ తీరం వద్ద కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. ఇది తూర్పు దిశగా ప్రయాణించి రత్నగిరి, డాపోలీ మధ్య కొంకణ్ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తన అంచనాలో తెలిపింది.
సంబంధిత కథనం