Sikkim rains : సిక్కింలో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 2వేల మంది పర్యటకులు!
Sikkim floods latest news : సిక్కింలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి చెందారు. మరో 2,000 మంది పర్యటకులు చిక్కుకుపోయారు.
Sikkim floods death toll : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా హిమాలయ రాష్ట్రమైన సిక్కింలో ఈ వారంలో ఆరుగురు మరణించారు. సుమారు 2,000 మంది పర్యటకులు చిక్కుకుపోయారని అధికారులు శుక్రవారం తెలిపారు.
సిక్కిం సరిహద్దులో ఉన్న నేపాల్‌లోని తప్లెజంగ్ జిల్లాలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి.. నిద్రిస్తున్న ఇల్లు కొట్టుకుపోవడంతో మరో నలుగురు మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగన్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని ఈశాన్య భారత రాష్ట్ర స్థానిక ప్రభుత్వం తెలిపింది.
Sikkim rains latest news : “36 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉత్తర సిక్కింకు వెళ్లే రహదారి పలు చోట్ల దెబ్బతినడంతో జిల్లాతో సంబంధాలు తెగిపోయాయి,” అని మంగన్ జిల్లా మేజిస్ట్రేట్ హేమ్ కుమార్ ఛెత్రి తెలిపారు.
చిక్కుకుపోయిన పర్యటకులంతా సురక్షితంగా ఉన్నారని, అయితే వరదల కారణంగా వారిని తరలించలేకపోయామని, వారిలో 11 మంది విదేశీయులు ఉన్నారని ఆయన చెప్పారు.
భూటాన్, చైనా, నేపాల్ మధ్య ఉన్న 650,000 మంది జనాభా కలిగిన చిన్న బౌద్ధ రాష్ట్రమైన సిక్కిం. ఒక ప్రసిద్ధ పర్యటక ప్రదేశం. కానీ హిమాలయాలలో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల సంభవించే ప్రకృతి వైపరీత్యాలు సిక్కింని ఎప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి.
Floods in Sikkim : గత ఏడాది సిక్కింలో హిమాలయ హిమనదీయ సరస్సు ఉప్పొంగి వరదల కారణంగా 179 మంది మరణించారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఇదీ చూడండి:- 14 June 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి
తాజా పరిణామాల మధ్య.. రోడ్డును చక్కదిద్దేందుకు సిబ్బంది, యంత్రాలను మోహరించామని, నష్టం విస్తృతంగా ఉందని, మరమ్మతులకు కొంత సమయం పడుతుందని ఛెత్రి తెలిపారు. వర్షాలకు సుమారు 50 ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలను పునరావాస శిబిరానికి తరలించినట్టు వివరించారు.
Sikkim floods latest photos : నేపాల్ తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, హిమాలయ దేశ పశ్చిమ ప్రాంతాలు అత్యంత వేడిగా ఉన్నాయని వాతావరణశాఖ అధికారులుతెలిపారు.
నైరుతి రుతుపవనాలు.. ఈశాన్య భారతాన్ని గత నెల 30న తాకాయి. అందుకే.. సిక్కింతో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఇది ప్రజలను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్న విషయం.
sikkim rains news : చాలా చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరుకుంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చాలా మంది.. ఇళ్లపైకి ఎక్కుతున్నారు. అధికారులు వచ్చి సాయం చేస్తారని ఆశలో ఉన్నారు. మరోవైపు.. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సిక్కిం ప్రభుత్వం చెప్పింది. ప్రజలను రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు అన్ని విధాలుగా కృషిచేస్తున్నట్టు వివరించింది. కాగా.. మరికొన్ని రోజుల పాటు వర్షం కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
సంబంధిత కథనం