Rain alert : ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.. ప్రజలకు అలర్ట్​-heavy rain alert in these states for the next 5 days ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Heavy Rain Alert In These States For The Next 5 Days

Rain alert : ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.. ప్రజలకు అలర్ట్​

Sharath Chitturi HT Telugu
Sep 12, 2022 03:38 PM IST

IMD Rain alert : రానున్న ఐదు రోజుల పాటు ఉత్తర భారతంతో పాటు అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ విషయాన్ని ఐఎండీ వెల్లడించింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు ఆరెంజ్​ అలర్ట్​ని కూడా జారీ చేసింది.

ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.. ప్రజలకు అలర్ట్​
ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.. ప్రజలకు అలర్ట్​ (PTI)

IMD rain alert for next 5 days : దక్షిణ ఒడిశాపై ఏర్పడిన అల్పపీడనం మరింత బలహీన పడిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం ఆగ్నేయ మధ్యప్రదేశ్​వైపు ప్రయాణిస్తోందని స్పష్టం చేసింది. ఫలితంగా.. వాయువ్య భారతంతో పాటు ఉత్తరాఖండ్​లో రానున్న ఐదు రోజుల పాటు జోరుగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అంతేకాకుండా.. దక్షిణ గుజరాత్​, ఉత్తర మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​లోనూ భారీ వర్షాలు పడతాయని వివరించింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలకు ఆరెంజ్​ అలర్ట్​ను జారీ చేసింది ఐఎండీ.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

ఈ ప్రాంతాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాలు..

ఈ నెల 12న మరాఠావాడాలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. 12,13న ఛత్తీస్​గఢ్​- విదర్భలో, 13,14న బిహార్​లో, 12 నుంచి 14 మధ్యల్లో ఝార్ఖండ్​, సౌరాష్ట్ర, కచ్​, పశ్చిమ్​ బెంగాల్​, ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. మధ్యప్రదేశ్​, గుజరాత్​, మధ్య మహారాష్ట్ర, కోంకణ్​, గోవాల్లో 5 రోజుల పాటు విస్త్రతంగా వర్షాలు కురుస్తాయి.

IMD rain alert : ఈ నెల 12-15 మధ్యలో తూర్పు రాజస్థాన్​లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి. ఇక రానున్న ఐదు రోజుల్లో ఉత్తరాఖండ్​, ఉత్తర్​ప్రదేశ్​లో వానలు కురుస్తాయి.

తెలంగాణ, కర్ణాటకలో 12న మోస్తారు వర్షాలు పడతాయి. 12,13న తమిళనాడులోని ఘాట్​ ప్రాంతాలు, 12-14మధ్యలో కర్ణాటక తీర ప్రాంతంలో విస్తృతంగా వానలు కురుస్తాయి.

ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్​, ఒడిశా, పశ్చమ్​ బెంగాల్​లో సముద్రంలో పరిస్థితులు తీవ్రంగా ఉండనున్నాయి. 12-14 మధ్యలో ఆయా ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణలో కుంభవృష్టి..

Rains in Telangana : తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తునే ఉన్నాయి. గత పదేళ్లలో సెప్టెంబర్​లో ఎన్నడు కురవని స్థాయిలో కుంభవృష్టి కురుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. 24 గంటల వ్యవధిలో భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లిలో 35.1సెం.మీల వర్షపాత నమోదైంది. రాజన్న జిల్లా అవునూర్‌లో 20.8, మర్తనపేటలో 20.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. మెదక్‌, రంగారెడ్డి, నిజమాబాద్‌, కరీంనగర్‌, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

తెలంగాణలో వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో కొత్త రికార్డులు ఏర్పడ్డాయి. 1908 నుంచి ఇప్పటి వరకు 24 గంటల వ్యవధిలో అత్యధిక వర్షం ఖమ్మం జిల్లా కోహెడలో నమోదైంది. 1996 జూన్‌ 17న 67.5 సెంటిమీటర్ల వర్షపాతం, 1983 అక్టోబర్ 6న నిజామాబాద్‌లో 35.5సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆళ్ళపల్లిలో ఆదివారం 35.1 సెం.మీల వర్షపాతం నమోదైంది.

తెలంగాణ వర్షాలపై పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం