Heatwave alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!-heatwave alert issued in these states heavy to very heavy rains in north east ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Heatwave Alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!

Heatwave alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!

Sharath Chitturi HT Telugu
May 04, 2024 08:49 AM IST

Andhra Pradesh heatwave : పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు సహా వివిధ ప్రాంతాల్లో మే 4, 5 తేదీల్లో వడగాల్పులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. పూర్తి వివరాలు..

వడగాల్పులకు అల్లాడిపోతున్న ప్రజలు..
వడగాల్పులకు అల్లాడిపోతున్న ప్రజలు..

Telangana Heatwave alert : భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు బ్యాడ్​ న్యూస్​ చెప్పింది భారత వాతావరణశాఖ (ఐఎండీ). మే 7 వరకు దేశంలోని అనేక రాష్ట్రాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. కాగా.. ఈశాన్య భారతంలో మరో రెండు రోజుల పాటు అంటే మే 5, 6 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

yearly horoscope entry point

ఈ రాష్ట్రాల్లో వడగాల్పులు..

ఐఎండీ ప్రకారం.. పశ్చిమ బెంగాల్​లోని గంగా నదీ తీర ప్రాంతం, బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి & కరైకల్, ఇంటీరియర్ కర్ణాటకలో ఈ రోజు అంటే మే 4న వడగాల్పులు వీస్తాయని అంచనా వేసింది.

మే 5న.. పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, సౌరాష్ట్ర, కచ్, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఇంటీరియర్ కర్ణాటకలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Andhra Pradesh heatwave alert : పుదుచ్చేరి, కరైకల్, నార్త్ ఇంటీరియర్ కర్ణాటకలో మే 6న వడగాల్పుల ప్రభావం ఉంటుంది.

మే 7న పశ్చిమ రాజస్థాన్, సౌరాష్ట్ర, కచ్, నార్త్ ఇంటీరియర్ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

మే 3న రాయలసీమలోని నంద్యాలలో 47 డిగ్రీలు, కోస్తాంధ్రలోని రెంటచింతలలో 45.2 డిగ్రీల సెల్సియస్, యానాంలో 45.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

IMD heatwave alert : మరోవైపు.. మే 5, 6 తేదీల్లో ఈశాన్య భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాల కురిసే అవకాశం ఉంది ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్​లో మే 5న భారీ నుంచి అతి భారీ వర్షాలు (115.5-204.4 మిల్లీమీటర్లు), మే 5, 6 తేదీల్లో నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (115.5-204.4 మిల్లీమీటర్లు) కురిసే అవకాశం ఉంది.

అసోం, మేఘాలయలో (115.5-204.4 మిల్లీమీటర్లు) మే 5, 6 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

మే 3 నుంచి 5వ తేదీ వరకు జమ్ముకశ్మీర్, లడఖ్, గిల్గిత్-బాల్టిస్థాన్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మే 6-9 తేదీలలో తూర్పు ఉత్తర్​ ప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్​లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

AP TS weather update : కాగా.. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మాహేల్లోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటితో పాటు మే 7న కోస్తాంధ్ర, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.