Haryana bus accident : బోల్తాపడిన బస్సు.. 40మంది విద్యార్థులకు గాయాలు!-haryana bus accident 40 students injured as bus overturned in panchkula ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Haryana Bus Accident : బోల్తాపడిన బస్సు.. 40మంది విద్యార్థులకు గాయాలు!

Haryana bus accident : బోల్తాపడిన బస్సు.. 40మంది విద్యార్థులకు గాయాలు!

Sharath Chitturi HT Telugu

హరియాణాలో ఓ బస్సు బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 40 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.

బోల్తాపడిన బస్సు..

హరియాణాలో అతివేగంతో ప్రయాణిస్తున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మంది స్కూల్​ విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

హరియాణా పంచకులలోని నౌల్టా గ్రామం వద్ద సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ఉన్నట్టు తెలుస్తోంది. అంటే బస్సులో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉన్నారు.

బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. దీనికితోడు బస్సు సామర్థ్యానికి మించి ప్రయాణికులతో నిండిపోవడం, ఓవర్ లోడ్, రోడ్డు పరిస్థితులు సరిగా లేకపోవడం కూడా ప్రమాదానికి అదనపు కారణాలుగా చెబుతున్నారు.

మరోవైపు ఘటనాస్థలంలో బస్సు బోల్తాపడటాన్ని స్థానికులు చూశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి, బాధితులను సరైన సమయానికి ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారు.

ఆరోగ్యం విషమించిన ఓ మహిళా బాధితురాలిని ఛండీగఢ్​లోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు.

ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించామని పంచకులలోని కల్కా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరి తెలిపారు.

ఈ విషయంలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

హరియాణాలో రోడ్డు ప్రమాదాలు సాధారణంగా మారిపోయాయి. ఫరూఖ్ నగర్ సమీపంలోని కుండ్లీ-మనేసర్-పల్వాల్ (కేఎంపీ) ఎక్స్​ప్రెస్​వేపై ట్రక్​ను ఓ కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జూలై 2న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆరుగురు సభ్యుల కుటుంబం హరిద్వార్ నుంచి గురుగ్రామ్ మీదుగా రాజస్థాన్​లోని సికార్ జిల్లాలోని హసంపూర్ గ్రామానికి తమ తండ్రి చితాభస్మాన్ని గంగానదిలో నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

ట్రక్కు, కారు గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్లలో ఒకరు అకస్మాత్తుగా లేన్ మార్చడం లేదా ట్రక్కు వేగం తగ్గించడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోగా, ఎక్స్​ప్రెస్​వేపై రెండు వాహనాలను సీజ్ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.