H-1B visa registrations : రేపటి నుంచి హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్లు..
H-1B visa registrations for 2024 : హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చ్ 1న ప్రారంభంకానుంది. రిజిస్ట్రేషన్ ఫీజ్‌తో పాటు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

H-1B visa registrations for 2024 : 2024 ఆర్థిక ఏడాదికి సంబంధించిన హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మార్చ్ 1న ప్రారంభంకానుంది. మార్చ్ 17 వరకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ విషయాన్ని యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ విభాగం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్న వారందరు.. యూసీఐఎస్లో అకౌంట్ ఓపెన్ చేసి, సంబంధిత వివరాలను ఫిల్ చేసి, రిజిస్ట్రేషన్‌ను సబ్మీట్ చేయాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను ట్రాక్ చేసేందుకు వీలుగా.. యూసీఐఎస్ ఓ కాన్ఫ్రంటేషన్ నెంబర్‌ను అలాట్ చేస్తుంది. ఈ నెంబర్‌తో కేవలం ప్రాసెస్‌ను ట్రాక్ చేయగలరు. కానీ హెచ్-1బీ వీసా స్టేటస్‌ను ట్రాక్ చేయలేరు.
H-1B visa registration fee : విదేశీయులను పనిలోకి చేర్చుకునేందుకు వీలుగా అక్కడి సంస్థలకు ఈ హెచ్-1బీ వీసాలు ఉపయోగపడతాయి. ఈ తరహా వీసాలు ఉన్న ఉద్యోగులు.. భవిష్యత్తులో గ్రీన్ కార్డులను కూడా సంపాదించుకోవచ్చు. అందుకే ఈ హెచ్-1బీ వీసాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ప్రతియేటా 85వేల మందికిపైగా ఉద్యోగులకు ఈ హెచ్-1బీ వీసా అలాట్ అవుతుంది.
హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ..
How to register H1B visa : స్టెప్ 1:- https://myaccount.uscis.gov/users/sign_up లో myUSCIC లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నాన్- రీఫండెబుల్ అమౌంట్ 10 డాలర్లు చెల్లించాలి.
స్టెప్ 2:- సొంత రిజిస్ట్రేషన్లు అప్లే చేస్తున్న వారు 'రిజిస్ట్రంట్' అకౌంట్‌ను ఉపయోగించాలి. (ఈ ప్రక్రియ ఈ నెల 21నే మొదలైంది.)
H-1B visa USA : స్టెప్ 3:- అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత.. రిప్రెసెంటేటివ్స్.. క్లైంట్ల అకౌంట్లను యాడ్ చేసుకోవచ్చు.
స్టెప్ 4:- లబ్ధిదారుల వివరాలను యాడ్ చేసేందుకు రిప్రెసెంటేటివ్స్, క్లైంట్లు మార్చ్ 1 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం 10 డాలర్ల రిజిస్ట్రేషన్ ఫీజ్‌ను సబ్మీట్ చేయాలి. ఒక వ్యక్తి.. అనేక మంది లబ్ధిదారుల వివరాలను పొందుపరచవచ్చు.
స్టెప్ 5:- ఫైనల్ పేమెంట్ జరిగేంత వరకు డ్రాఫ్ట్‌ని ఎడిట్, ప్రిపేర్, స్టోర్ చేసుకోవచ్చు. సబ్మీట్ చేయాలి.
భారతీయులకు కీలకం..
H-1B visa registrations Indians : ఈ దఫా హెచ్-1బీ వీసాకు ఎంపికైన వారికి.. మార్చ్ 31 నాటికి అమెరికా ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ వస్తుంది. అక్కడి 90 రోజుల వ్యవధిలో అప్లికెంట్లు.. తమ హెచ్-1బీ పిటీషన్లను యూఎస్సీఐఎస్కు అధికారికంగా సమర్పించాల్సి ఉంటుంది.
ఈ హెచ్-1బీ వీసా అనేది భారతీయులకు ఎంతో ముఖ్యమైనది. ఐటీ, ఆర్థిక, ఇంజీనిరింగ్, ఆర్కిటెక్చర్ వృత్తుల్లోని వారు ఈ వీసాల మీద అమెరికాకు వెళుతూ ఉంటారు. ఈ వీసాకు 3ఏళ్ల కాల వ్యవధి ఉంటుంది. అనంతరం మరో మూడేళ్ల వరకు ఎక్స్టెండ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.