H-1B processing fee: వచ్చే సంవత్సరం పెరగనున్న హెచ్ 1 బీ వీసా ప్రాసెసింగ్ ఫీజు-h1b visa application premium processing fee increased by 12 percent ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  H-1b Processing Fee: వచ్చే సంవత్సరం పెరగనున్న హెచ్ 1 బీ వీసా ప్రాసెసింగ్ ఫీజు

H-1B processing fee: వచ్చే సంవత్సరం పెరగనున్న హెచ్ 1 బీ వీసా ప్రాసెసింగ్ ఫీజు

HT Telugu Desk HT Telugu
Dec 29, 2023 07:25 PM IST

H-1B processing fee: వచ్చే సంవత్సరం హెచ్ 1 బీ వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు దాదాపు 12% వరకు పెరగనుంది. ఈ పెంపు అనంతరం కొత్త ఫీజు 2805 డాలర్లు ఉంటుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

H-1B processing fee: H-1B వీసా దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును పెంచుతున్నట్లు అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ (USCIS) ప్రకటించింది. ఈ పెంపు 12% ఉంటుందని వెల్లడించింది. కొత్త ఫీజు 2805 డాలర్లు గా ఉంటుంది.

yearly horoscope entry point

ఫిబ్రవరి 26 నుంచి..

H-1B వీసా దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 26 వ తేదీ నుంచి 12% పెరుగుతుంది. యూఎస్సీఐఎస్ (USCIS) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐ 129 (I-129), ఐ 140 (I-140), ఐ 539 (I-539), ఐ 765 (I-765) వీసా ఫామ్స్ కు సంబంధించిన ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు పెరుగుతుంది.

USCIS ప్రకటించిన కొత్త ఫీజులు ఇవే..

నాన్ ఇమిగ్రంట్ వర్కర్ కు సంబంధించిన ఐ 129 వీసా దరఖాస్తు ఫీజు ప్రస్తుతం 2,500 డాలర్లు ఉండగా, పెంపు అనంతరం 2805 డాలర్లకు పెరుగుతుంది. ఐ 129 ఫామ్ ఎల్ 1 వీసాకు కూడా వర్తిస్తుంది. వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును పెంచడం ద్వారా దరఖాస్తుదారులకు మరింత మెరుగైన, మరింత వేగవంతమైన సేవలను అందించడానికి వీలవుతుందని యూఎస్సీఐఎస్ తెలిపింది. ప్రీమియం వీసా దరఖాస్తుల ఫీజు ప్రతీ ఆరు నెలలకు ఒకసారి పెంచుతామని వెల్లడించింది. వివిధ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు ఈ కింది పట్టికలో వివరంగా ఉంది.

FormCurrent FeeNew Fee
Form I-129, Petition for a Nonimmigrant Worker

$1,500 (H-2B or R-1 nonimmigrant status)

$2,500 (All other available Form I-129 classifications (E-1, E-2, E-3, H-1B, H-3, L-1A, L-1B, LZ, O-1, O-2, P-1, P-1S, P-2, P-2S, P-3, P-3S, Q-1, TN-1, and TN-2))

$1,685 (H-2B or R-1 nonimmigrant status)

$2,805 (All other available Form I-129 classifications (E-1, E-2, E-3, H-1B, H-3, L-1A, L-1B, LZ, O-1, O-2, P-1, P-1S, P-2, P-2S, P-3, P-3S, Q-1, TN-1, and TN-2))

Form I-140, Immigrant Petition for Alien Worker$2,500 (Employment-based (EB) classifications E11, E12, E21 (non-NIW), E31, E32, EW3, E13 and E21 (NIW))$2,805 (Employment-based (EB) classifications E11, E12, E21 (non-NIW), E31, E32, EW3, E13 and E21 (NIW))
Form I-539, Application to Extend/Change Nonimmigrant Status$1,750 (Form I-539 classifications F-1, F-2, M-1, M-2, J-1, J-2, E-1, E-2, E-3, L-2, H-4, O-3, P-4, and R-2)$1,965 (Form I-539 classifications F-1, F-2, M-1, M-2, J-1, J-2, E-1, E-2, E-3, L-2, H-4, O-3, P-4, and R-2)
Form I-765, Application for Employment Authorization$1,500 (Certain F-1 students with categories C03A, C03B, C03C)$1,685 (Certain F-1 students  with categories C03A, C03B, C03C)
Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.