H-1B petition : హెచ్​1బీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ముగింపు- మరి నెక్ట్స్​ ఏంటి?-h1b petition filing starts when is the deadline heres a quick rundown ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  H-1b Petition : హెచ్​1బీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ముగింపు- మరి నెక్ట్స్​ ఏంటి?

H-1B petition : హెచ్​1బీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ముగింపు- మరి నెక్ట్స్​ ఏంటి?

Sharath Chitturi HT Telugu

H-1B visa : 2026 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ 2025 మార్చ్​ 24న ముగిసింది. రిజిస్ట్రేషన్లు పరిమితిని మించితే, లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. ఏప్రిల్ ప్రారంభంలో ఫలితాలు వస్తాయి.

హెచ్​1బీ వివరాలు.. (Representational Image)

2026 ఆర్థిక సంవత్సరానికి (ఎఫ్​వై 2026) ఇనీషియల్​ హెచ్ -1 బి వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2025 మార్చ్ 24తో​ అధికారికంగా ముగిసింది. నెక్ట్స్​ ఏంటి? అన్నది ఇప్పుడు హెచ్​1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న చాలా మందికి ఉన్న అతిపెద్ద ప్రశ్న.

రిజిస్ట్రేషన్ల సంఖ్య వార్షిక పరిమితిని మించితే, వీసా గ్రహితలను రాండమ్​గా ఎంపిక చేసేందుకు లాటరీ విధానాన్ని అమలు చేస్తుంది యూఎస్ సిటిజన్​షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్​సీఐఎస్) లాటరీ ఫలితాలను సాధారణంగా మార్చ్​ చివరిలో లేదా ఏప్రిల్ మొదట్లో ప్రకటిస్తారు.

హెచ్-1బీ దరఖాస్తు గడువు ఎంత?

ఎంపికైన వారికి సంబంధించి, ఏప్రిల్ 1, 2025 నుంచి పూర్తి హెచ్-1బీ పిటిషన్లు ఎంప్లాయర్లు దాఖలు చేయవచ్చు. ఫైలింగ్ వ్యవధి సాధారణంగా సెలక్షన్​ నోటిఫికేషన్ తేదీ నుంచి 90 రోజులు ఉంటుంది. అంటే ఇది ఏప్రిల్ 1 నుంచి జూన్ 30, 2025 వరకు నడుస్తుంది.

2026 ఆర్థిక సంవత్సరం కింద ఆమోదం పొందిన దరఖాస్తుదారులకు ఉపాధి 2025 అక్టోబర్ 1 లేదా ఆ తరువాత ప్రారంభమవుతుంది.

ఒకవేళ దరఖాస్తుదారుడు ఎంపిక కానట్లయితే, వారి రిజిస్ట్రేషన్ "సబ్మిటెడ్​" స్టేటస్​లో ఉంటుంది. క్యాప్ స్లాట్లు తెరిచి ఉంటే యూఎస్​సీఐఎస్ అదనపు లాటరీ రౌండ్లను నిర్వహించవచ్చు. కాబట్టి దరఖాస్తుదారులు అప్డేట్స్​ కోసం వారి యూఎస్​సీఐఎస్ ఖాతాలను పర్యవేక్షించాలి.

హెచ్ 1బీ లాటరీ విధానంలో నిబంధనలను కఠినతరం చేసిన యూఎస్​సీఐఎస్..

ఈ ఏడాది హెచ్ -1బీ విధానంలో రిజిస్ట్రేషన్ ఫీజులు భారీగా పెరగడం గమనార్హం. 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు, ప్రతి లబ్ధిదారుని ఖర్చు 2050% పెరిగింది. యూఎస్​సీఐఎస్ ధృవీకరించిన రుసుము అడ్మినిస్ట్రేషన్​ ఖర్చులను భరించడానికి, అనవసరంగా రిజిస్ట్రేషన్లు వేసే వారిని కట్​ చేయడానికి ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

2025 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన లబ్ధిదారు కేంద్రీకృత ఎంపిక ప్రక్రియ కూడా ఉంది అయితే ఒకటి కంటే ఎక్కువసార్లు లాటరీ వ్యవస్థలోకి రాకుండా ఇది చూసుకుంటుంది.

లాటరీ ఇంటిగ్రిటీని పెంచేందుకు హెచ్​-1బీ లాటరీ ప్రాసెస్​కు అదనపు ఫ్రాడ్​-ప్రివెన్షన్​ చర్యలను కూడా జోడించింది. ఇవి 2024 జనవరి 30 నుంచే అమల్లోకి వచ్చాయి. ఒకటికంటే ఎక్కువసార్లు ఎంట్రీ ఇవ్వలేదని వెరిఫై చేయడం, అర్హులైన వారు మాత్రమే హెచ్​-1బీ పిటిషన్స్​కు అప్లై చేసుకునేలా చూడటం, రిజిస్ట్రేషన్లలో మోసాలకు పాల్పడడం- ఫైలింగ్స్​ని డూప్లికేట్​ చేయడాన్ని అడ్డుకోవడం వంటి కొన్ని ఉదాహరణలు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.