Gujarat Elections 2022 : గుజరాత్​లో.. రెండో దశ పోలింగ్​ షురూ-gujarat election 2022 voting begins in 93 seats pm modi to cast his vote in ahmedabad ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Gujarat Election 2022, Voting Begins In 93 Seats, Pm Modi To Cast His Vote In Ahmedabad

Gujarat Elections 2022 : గుజరాత్​లో.. రెండో దశ పోలింగ్​ షురూ

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 05, 2022 08:03 AM IST

Gujarat Elections 2022 : గుజరాత్​ ఎన్నికల హడావుడికి నేటితో తెరపడనుంది. 93 నియోజకవర్గాల్లో సోమవారం ఉదయం పోలింగ్​ ప్రారంభమైంది. 2.51కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఈవీఎంతో ఈసీ సిబ్బంది
ఈవీఎంతో ఈసీ సిబ్బంది (AP)

Gujarat Elections 2022 : హైఓల్టేజ్​ ప్రచారాలకు తెరపడిన తర్వాత.. గుజరాత్​ ఎన్నికల రెండో దశ పోలింగ్​ సోమవారం ప్రారంభమైంది. 93 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం వరకు ఓటింగ్​ ప్రక్రియ జరగనుంది. ఇందుకోసం అధికారులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

మొత్తం మీద ఉత్తర, మధ్య గుజరాత్​లోని 14 జిల్లాల్లో సోమవారం పోలింగ్​ జరగనుంది. అహ్మదాబాద్​, గాంధీనగర, మేహ్సానా, పటాన్​, బనస్కాంత, సబర్​కాంత, అరావళి, మహిసాగర్​, పంచమహల్​, దహోడ్​, వడోదరా, ఆనంద్​, ఖేడా, ఛోటా ఉదయ్​పూర్​ జిల్లాల్లో ఎన్నికల హడావుడి స్పష్టంగా కనిపిస్తోంది. 93 సీట్ల కోసం 61 పార్టీలకు చెందిన 833మంది బరిలో నిలిచారు. 2.51కోట్ల మంది ఓటర్లు.. వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు.

Gujarat elections latest updates : ఓటింగ్​ కోసం 26,409 పోలింగ్​ బూత్​లను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. వీటిల్లో 93 మోడల్​ పోలింగ్​ బూత్​లు, 93 ఇకో ఫ్రెండ్లీ బూత్​లు ఉన్నాయి. మరో 93 పోలింగ్​ కేంద్రాలను దివ్యాంగులు నిర్వహిస్తుండగా.. 14 బూత్​లను యువత చూసుకుంటోంది. దాదాపు 36వేల ఈవీఎంలను ఈసారి వినియోగిస్తోంది. 29వేల మంది ప్రిసైడింగ్​ ఆఫీసర్లు, 84వేల మంది పోలింగ్​ ఆఫీసర్లు.. విధి నిర్వహణలో ఉన్నారు.

"2,51,58,730 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో.. 1,29,26,501 మంది పురుషులు, 1,22,31,335 మంది మహిళలు ఉన్నారు. థర్డ్​ జెండర్​ నుంచి 894మంది ఓటర్లు ఉన్నారు," అని ఈసీ స్పష్టం చేసింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్​ షాతో పాటు పలువురు ప్రముఖులు ఈ దఫా పోలింగ్​లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అహ్మదాబాద్​ సిటీలోని ఓ పోలింగ్​ బూత్​లో మోదీ ఓటు వేయనున్నారు.

ఉప ఎన్నికలు కూడా..

2022 By elections : గుజరాత్​ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ సీట్లు, ఒక లోక్​సభ స్థానానికి ఓటింగ్​ ప్రక్రియ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

వీటిల్లో ఉత్తర్​ప్రదేశ్​ మెయిన్​పూరి లోక్​సభ సీటుకు ఉప ఎన్నిక హాట్​టాపిగ్​గా మారింది. దివంగత ఎస్​పీ అధ్యక్షుడు ములాయం సింగ్​ మరణంతో ఇక్కడ ఉపఎన్నిక జరుగుతోంది. అఖిలేష్​ యాదవ్​ సతీమణి డింపుల్​ యాదవ్​ బరిలో నిలిచారు.

మరోవైపు ఉత్తర్​ప్రదేశ్​లోని రామ్​పూర్​ సదర్​, ఖటౌలీ, ఒడిశాలోని పదమ్​పూర్​, రాజస్థాన్​కు చెందిన సర్దరాషహర్​, బిహార్​లోని కుర్హాని, ఛత్తీస్​గఢ్​లోని భానుప్రతాప్​పూర్​లో సైతం ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి.

ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత.. సోమవారం సాయంత్రం నాటికి గుజరాత్​, హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికలకు సంబంధించిన ఎగ్గిట్​ పోల్స్​ వెలువడతాయి.

Gujarat election results 2022 : గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ ఉప సమరం ఫలితాలు డిసెంబర్​ 8న వెలువడనున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం