BSF jawan killed in Gujarat : కూతురిపై అశ్లీల వీడియో.. ప్రశ్నించిన జవానును చంపేశారు!
BSF jawan killed in Gujarat : గుజరాత్లో ఓ బీఎస్ఎఫ్ జవానును కొందరు కొట్టి చంపేశారు! తన కుమార్తెకు సంబంధించిన వీడియోను ఎందుకు ఆన్లైన్లో పోస్ట్ చేశారు? అని జవాను ప్రశ్నించినందుకు.. నిందితుడు కుటుంబసభ్యులు దాడి చేశారు.
BSF Jawan killed in Gujarat : గుజరాత్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన కుమార్తెకు సంబంధించిన ఓ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేసినందుకు.. నిరసన వ్యక్తం చేశాడు ఓ జవాను. నిందితుడి కుటుంబం.. అతడిని కొట్టి చంపేసింది! ఈ ఘటనలో పోలీసులు ఇప్పటివరకు ఏడుగురుని అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది..
45ఏళ్ల మేలాజీ వఘేలా.. బీఎస్ఎఫ్ 56 బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతని కుటుంబం గుజరాత్‌లోని ఖేడా ప్రాంతంలో నివాసముంటోంది. వానిపుర గ్రామానికి చెందిన శైలేశ్ అలియాస్ సునీల్ జాదవ్.. వఘేలా కుమార్తెకు సంబంధించి కొన్ని రోజుల క్రితం ఓ అశ్లీల వీడియో చిత్రీకరించాడు! ఆ వెంటనే దానిని ఆన్లైన్లో పోస్ట్ చేశాడు.
Gujarat BSF Jawan killed : శైలేశ్ చేసిన తప్పును నిలదీసేందుకు.. కుమారుడు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఈ నెల 24న నిందితుడి ఇంటికి వెళ్లాడు మేలాజీ వఘేలా. ఆ సమయంలో అక్కడ శైలేశ్ లేడు. కాగా అతని కుటుంబసభ్యులను నిలదీశాడు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మేలాజీపై కోపం పెంచుకున్న నిందితుడు తరఫు కుటుంబసభ్యులు.. జవానుపై దాడి చేశారు. కర్రలు, పదునైన ఆయుధాలతో దాడికి దిగారు. ఫలితంగా మేలాజీ వఘేలా ప్రాణాలు కోల్పోయాడు. అతని కుమారుడు నవ్‌దీప్.. తీవ్ర గాయాలతో అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Jawan killed in Gujarat : బీఎస్ఎఫ్ జవాను భార్య ఫిర్యాదు మేరకు.. ఛక్లాసి పోలీస్ స్టేషన్ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. ఘటనపై దర్యాపు చేపట్టి.. తాజాగా ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
సంబంధిత కథనం