Gujarat MLA's : ఆ 40మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్​ కేసులు.. రేప్​, మర్డర్​ కూడా!-gujarat 40 newly elected mlas facing criminal cases says adr ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Gujarat: 40 Newly-elected Mlas Facing Criminal Cases, Says Adr

Gujarat MLA's : ఆ 40మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్​ కేసులు.. రేప్​, మర్డర్​ కూడా!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 12, 2022 07:27 AM IST

Gujarat MLA's criminal records : గుజరాత్​లో జరిగిన ఎన్నికల్లో గెలిచి, ఎమ్మెల్యేలుగా మారిన 40మందిపై క్రిమినల్​ కేసులు ఉన్నాయి. వీరిలో 29మంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఎన్నికల్లో గెలుపు అనంతరం బీజేపీ మద్దతుదారుల సంబరాలు
ఎన్నికల్లో గెలుపు అనంతరం బీజేపీ మద్దతుదారుల సంబరాలు (HT_PRINT)

Gujarat MLA's criminal records : గుజరాత్​లో 182 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన 40మందిపై క్రిమినల్​ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఏడీఆర్​(అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రిఫార్మ్స్​) వెల్లడించింది. ఈ 40లో.. 29మందిపై మర్డర్​, రేప్​ వంటి తీవ్రమైన కేసులు నమోదై ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

రేప్​.. అటెంప్ట్​ టు మర్డర్​..!

ఇటీవలే ముగిసిన గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల్లో 156 సీట్లతో ఘన విజయాన్ని అందుకుంది బీజేపీ. వరుసగా 7వసారి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్​ 17స్థానాలకు పరిమితమైంది. ఆప్​ 5 చోట్ల గెలిచింది.

Gujarat Assembly election results 2022 : ఇక తీవ్రస్థాయి క్రిమినల్​ కేసులున్న 29మంది ఎమ్మెల్యేల్లో.. 20 మంది బీజేపికి చెందినవారు ఉన్నారు. కాంగ్రెస్​ నుంచి నలుగురు, ఆమ్​ ఆద్మీ పార్టీ నుంచి ఇద్దరు ఈ తరహా కేసులను ఎదుర్కొంటున్నారు. ఇద్దరు స్వతంత్రులు, ఒక ఎస్​పీ ఎమ్మెల్యేపైనా తీవ్రమైన క్రిమినల్​ కేసులు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్​ను పరిశీలించి ఈ నివేదికను రూపొందించింది ఏడీఆర్​.

ఏడీఆర్​ ప్రకారం.. బీజేపీలోని 26మంది ఎమ్మెల్యేలు(17శాతం), కాంగ్రెస్​లోని 9మంది(53శాతం), ఆప్​లోని 5(40శాతం), ముగ్గురు స్వతంత్రుల్లో ఇద్దరు(68శాతం), ఒక ఎస్​పీ అభ్యర్థిపై క్రిమినల్​ కేసులు పెండింగ్​లో ఉన్నాయి.

Gujarat elections BJP : కాగా.. 2017 ఎన్నికలతో పోల్చుకుంటే.. క్రిమినల్​ కేసులు ఎదుర్కొంటూ, ఎన్నికల్లో విజయం సాధించిన వారి సంఖ్య తగ్గింది. 2017లో.. తమపై క్రిమినల్​ కేసులు ఉన్న 47మంది గెలుపొందారు. ఈసారి ఆ సంఖ్య 40కే పరిమితమైంది.

ఈ దఫా ఎన్నికల్లో గెలుపొందిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. తమపై అటెంప్ట్​ టు మర్డర్​ కేసులు ఉన్నట్టు అఫిడవిట్​లో పేర్కొన్నారు. వీరు.. కాంగ్రెస్​కు అనంత్​ పటేల్​(వన్స్​దా), కిరీట్​ పటేల్​(పఠాన్​), బీజేపీకి చెందిన కాలూభాయ్​ రాథోడ్​(ఉన). ఎమ్మెల్యేలుగా గెలిచిన నలుగురిపై సెక్షన్​ 354(మహిళలపై లైంగిక దాడి), సెక్షన్​ 376(అత్యాచారం) వంటి కేసులు ఉన్నాయి.

మొత్తం మీద.. గుజరాత్​ ఎన్నికల బరిలో నిలిచిన 1621 మంది అభ్యర్థుల్లో దాదాపు 20శాతం మంది నేర చరిత్ర ఉన్నవారే! మొత్తం 330మందిపై వివిధ క్రిమినల్​ కేసులు ఉన్నాయి. ఈ జాబితాలో ఆమ్​ ఆద్మీ పార్టీ టాప్​లో(61మంది) నిలిచింది. ఈ 330మందిలో కేవలం 40మందిని ప్రజలు గెలిపించారు.

Gujarat MLA's : కాగా.. 2017 ఎన్నికలతో పోల్చుకుంటే.. క్రిమినల్​ కేసులు ఉన్న అభ్యర్థుల సంఖ్య ఈసారి పెరిగింది. నాటి ఎన్నికల్లో మొత్తం మీద 238మందికి నేర చరిత్ర ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం