GST revenue in july 2022: జీఎస్టీ వసూళ్లలో 28 శాతం పెరుగుదల.. -gst revenue collection for july second highest ever 28 percent higher than last year july ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Gst Revenue Collection For July Second Highest Ever 28 Percent Higher Than Last Year July

GST revenue in july 2022: జీఎస్టీ వసూళ్లలో 28 శాతం పెరుగుదల..

Praveen Kumar Lenkala HT Telugu
Aug 01, 2022 12:02 PM IST

GST revenue in july 2022: జీఎస్టీ వసూళ్లు దుమ్ము రేపాయి. రూ. 1.48 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి.

దుమ్ము రేపిన జీఎస్టీ వసూళ్లు.. ప్రభుత్వ ఖజానా ఫుల్లు..
దుమ్ము రేపిన జీఎస్టీ వసూళ్లు.. ప్రభుత్వ ఖజానా ఫుల్లు.. (HT_PRINT)

GST revenue in july 2022: జూలై 2022లో జీఎస్టీ వసూళ్లు రూ. 1,48,995 కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో సీజీఎస్టీ రూ. 25,571 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ రూ. 32,807 కోట్లు, ఐజీఎస్టీ రూ. 79,518 కోట్లుగా ఉంది. ఇక సెస్ రూపంలో రూ. 10,920 కోట్లు వసూలైంది. ఇప్పటి వరకు వసూలైన నెలవారీ రెవెన్యూలో రెండో అత్యధిక వసూలు కావడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

కాగా ప్రభుత్వం ఐజీఎస్టీ నుంచి రూ. 32,365 కోట్లను సీజీఎస్టీకి, రూ. 26,774 కోట్లను ఎస్‌జీఎస్టీకి పంచింది. ఈ సెటిల్మెంట్ తరువాత సీజీఎస్టీకి (కేంద్ర ప్రభుత్వానికి) మొత్తంగా రూ. 58,116 కోట్లు రాగా, ఎస్‌జీఎస్టీకి (రాష్ట్రాలకు) రూ. 59,581 కోట్లు దక్కింది.

కాగా జూలై రెవెన్యూ గత ఏడాది జూలైతో పోల్చితే 28 శాతం పెరిగింది. గత ఏడాది జూలైలో జీఎస్టీ వసూళ్లు రూ. 1,16,393 కోట్లుగా ఉంది. జూలై నెలలో దిగుమతులపై ఆదాయం ఎక్కువగా లభించింది.

వరుసగా ఐదో నెలలో జీఎస్టీ రెవెన్యూ రూ. 1.4 లక్షల కంటే ఎక్కువగా వసూలవడం విశేషం. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం జీఎస్టీ వసూళ్లు పెరగడానికి ప్రధానంగా దోహదపడిందని కేంద్ర ఆర్థిక వ్యవస్థ విశ్లేషించింది. జూన్ నెలలో 7.45 కోట్ల మేర ఈ-వే బిల్స్ జనరేట్ అయ్యాయని, మే నెలలో అవి 7.36 కోట్లుగా ఉన్నాయని తెలిపింది.

ఇక రాష్ట్రాల వారీగా చూస్తే జూలై 2022లో తెలంగాణలో 26 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 25 శాతం మేర జీఎస్టీ వసూళ్లు పెరిగాయి.

తెలంగాణలో రూ. 4,547 కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 3,409 కోట్ల మేర జీఎస్టీ వసూలైంది.

గత ఏడాది జూలైలో తెలంగాణలో రూ. 3,610 కోట్ల మేర, ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 3,409 కోట్ల మేర జీఎస్టీ వసూలైంది.

IPL_Entry_Point