Mukesh Ambani's security: ముకేశ్ అంబానీ సెక్యూరిటీ పెంపు-govt upgrades mukesh ambani s security cover to z plus ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Govt Upgrades Mukesh Ambani's Security Cover To Z Plus

Mukesh Ambani's security: ముకేశ్ అంబానీ సెక్యూరిటీ పెంపు

HT Telugu Desk HT Telugu
Sep 29, 2022 09:45 PM IST

Mukesh Ambani's security: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ సెక్యూరిటీని పెంచారు.

ముకేశ్ అంబానీ (ఫైల్ ఫొటో)
ముకేశ్ అంబానీ (ఫైల్ ఫొటో)

Mukesh Ambani's security: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి 'Z plus ' కేటగిరీ భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముకేశ్ అంబానీ ప్రాణాలకు ముప్పు ఉందన్న కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Mukesh Ambani's security: 2013 లోనే..

2013లోనే ముకేశ్ అంబానీకి Z కేటగిరీ భద్రత కల్పించారు. పేమెంట్ బేసిస్ పై ఆయనకు అప్పుడు సీఆర్ఫీఎఫ్ దళాలతో Z కేటగిరీ భద్రత కల్పించారు. ముకేశ్ అంబానీ భార్య నీతూ అంబానీ 'Y కేటగిరీ భద్రతలో ఉన్నారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో ముకేశ్ అంబానీ 11 వ స్థానంలో ఉన్నారు. ముకేశ్ అంబానీ భద్రతను Z కేటగిరీ కి పెంచుతూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆయనకు దాదాపు 40 నుంచి 50 సీఆర్పీఎఫ్ కమాండోలు విడతల వారీగా భద్రత కల్పిస్తారు. అంబానీకి వ్యక్తిగతంగానూ, అలాగే, ఆయన కార్యాలయాలు, నివాసానికి కూడా ఈ భద్రత వర్తిస్తుంది.

Mukesh Ambani's security: పేలుడు పదార్ధాలతో ఎస్ యూ వీ

గత సంవత్సరం ముకేశ్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్ధాలతో ఉన్న ఒక వాహనాన్ని పోలీసులు గుర్తించారు. ఆ తరువాత ముకేశ్ అంబానీ భద్రతను పెంచారు. ఈ కేసును ఎన్ఐఏ విాచారిస్తోంది. మరో ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రపంచ సంపన్నుల్లో మూడో స్థానంలో ఉన్న గౌతమ్ ఆదానీకి కూడా గత నెలలో ప్రభుత్వం Z కేటగిరీ భద్రత కల్పించింది.

IPL_Entry_Point

టాపిక్