దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన.. గృహాల కేటాయింపులో 4 శాతం రిజర్వేషన్!-govt mandates 4 percentage housing reservation for people with disabilities check out details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన.. గృహాల కేటాయింపులో 4 శాతం రిజర్వేషన్!

దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన.. గృహాల కేటాయింపులో 4 శాతం రిజర్వేషన్!

Anand Sai HT Telugu

దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నివాసాల కేటాయింపులో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టుగా ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం

ివ్యాంగులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని గృహ కేటాయింపు విధానంలో దివ్యాంగులకు 4 శాతం కోటా ఇవ్వాలని నిర్ణయించింది. ఇది చారిత్రాత్మక, ప్రధాన అడుగుగా గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ బ్రిడ్జి కింద అందుబాటులో ఉన్న వసతిలో వీరికి ఈ రిజర్వేషన్ కల్పించారు.

ఇకపై కేంద్ర ప్రభుత్వ వసతి గృహాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ఇది వారికి సౌలభ్యం కల్పించడమే కాకుండా, ప్రభుత్వ సేవల్లో సమానత్వం, గౌరవం, ప్రాప్యత దిశగా ఒక ముఖ్యమైన అడుగు అవుతుంది. 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' నినాదానికి అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

వికలాంగుల హక్కుల(ఆర్‌పీడబ్ల్యుడీ) చట్టం, 2016కు అనుగుణంగా దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వ నివాస సముదాయాలకు సరైన ప్రాప్యతను నిర్ధారించడానికి డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ ఆఫీస్ మెమోరాండం జారీ చేసిందని మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన యూనిక్ డిజేబిలిటీ ఐడీ(యూడీఐడీ) వారి వైకల్యాన్ని ధృవీకరించే చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్ అని మంత్రిత్వ శాఖ ఎస్టేట్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ 2025 మే 22న జారీ చేసిన ఆఫీస్ ఆర్డర్‌లో పేర్కొన్నారు. దీనికి ఆ శాఖకు చెందిన కాంపిటెంట్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కోటా కింద వసతి కోరుకునే ఉద్యోగులు ప్రతి నెలా eSampada వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రతి నెలా ఆటోమేటెడ్ వ్యవస్థ ద్వారా ఈ కేటాయింపులు జరుగుతాయి. దివ్యాంగులుగా నమోదు చేసుకున్న అభ్యర్థులు ప్రతి నెలా eSampada వెబ్‌సైట్‌లో కొత్తగా రూపొందించిన PwD కేటగిరీలో నమోదు చేసుకోవాలి. ప్రొఫైల్‌ను అప్డేట్ చేయడంలో యూడీఐడీ కార్డ్ అప్‌లోడ్ చేయాలి. శాఖలు వాటిని ధృవీకరించాల్సి ఉంటుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.