Governor vs government in 3states: ఈ మూడు రాష్ట్రాల్లో గవర్నర్ vs గవర్న్ మెంట్-governor vs government face off intensifies in 3 southern states dmk calls for ravi s sacking ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Governor Vs Government Face-off Intensifies In 3 Southern States; Dmk Calls For Ravi's Sacking

Governor vs government in 3states: ఈ మూడు రాష్ట్రాల్లో గవర్నర్ vs గవర్న్ మెంట్

Sudarshan Vaddanam HT Telugu
Nov 09, 2022 08:08 PM IST

Governor vs government in 3states: ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలతో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న గవర్నర్ కు పొసగకపోవడం దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ మూడు దక్షిణాది రాష్ట్రాల్లోనూ గవర్న్ మెంట్ వర్సెస్ గవర్నర్ పేచీ మొదలైంది.

తెలంగాణ గవర్నర్ తమిళ సై, తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ గవర్నర్ తమిళ సై, తెలంగాణ సీఎం కేసీఆర్

Governor vs government in 3states: రాష్ట్రాల్లో గవర్నర్ తో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పడకపోవడం కామన్. ముఖ్యంగా, కేంద్రం, రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉంటే, ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నాడని రాష్ట్ర ప్రభుత్వాలు.. రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న తన అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని గవర్నర్లు పరస్పరం విమర్శించుకుంటారు.

ట్రెండింగ్ వార్తలు

Governor vs government in 3 states: దక్షిణాది రాష్ట్రాలు

రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విబేధాలు తీవ్రమవుతున్న రాష్ట్రాల జాబితాలో ప్రస్తుతం మూడు రాష్ట్రాలు చేరాయి. ఆ మూడు కూడా దక్షిణాది రాష్ట్రాలు కావడం విశేషం. అంతే కాదు, ఆ మూడింటిలోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పవర్ లో లేదు. ఆ మూడు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో వామపక్షం, రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలైన టీఆర్ఎస్, డీఎంకేలు అధికారంలో ఉన్నాయి.

Governor vs government in 3states: తెలంగాణలో..

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, గవర్నర్ తమిళ సై మధ్య విబేధాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. గవర్నర్ బహిరంగంగానే రాష్ట్ర ప్రభుత్వంపై పలుమార్లు విమర్శలు గుప్పించగా, టీఆర్ఎస్ నేతలు కూడా గవర్నర్ బీజేపీ ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పరిస్థితులు, ప్రభుత్వ విధానాలకు సంబంధించి తరచూ ముఖ్యమంత్రి గవర్నర్ ను కలిసి వివరించడం రివాజు. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ పద్దతిని పెద్దగా పాటించడం లేదు. గత గవర్నర్ నరసింహన్ తో ఉన్న సత్సంబంధాలు ప్రస్తుత గవర్నర్ తమిళ సైతో సీఎం కేసీఆర్ కు లేవు. తెలంగాణలో అప్రజాస్వామిక ప్రభుత్వం ఉందని, తన ఫోన్ ను కూడా ట్యాప్ చేస్తున్నారని తమిళ సై ఆరోపిస్తున్నారు. తన పర్యటనల్లో ప్రొటోకాల్ ను పాటించడం లేదని విమర్శిస్తున్నారు.

Governor vs government in 3states: కేరళలో..

కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉంది. ఇక్కడ కూడా గవర్నర్ వర్సెస్ గవర్న్మెంట్ వివాదం తీవ్రంగా ఉంది. రాష్ట్రాల్లోని యూనివర్సిటీలకు చాన్సెలర్ గా గవర్నర్ వ్యవహరిస్తుంటారు. కేరళలో ఆ హోదా నుంచి గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ను తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది. ఆ పదవుల్లో ప్రముఖ విద్యా వేత్తలను నియమించాలని భావిస్తోంది. యూనివర్సిటీల హెడ్ గా గవర్నర్ లను నియమించకూడదని మాజీ సీజేఐ జస్టిస్ మదన్ మోహన్ పుంచి కమిటీ చేసిన సిఫారసులను కేరళ ప్రభుత్వం గుర్తు చేస్తోంది. అయితే, తనను చాన్సెలర్ గా తొలగిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్ ను స్వయంగా గవర్నరే జారీ చేయాల్సి రావడం ఇక్కడ విశేషం.

Governor vs government in 3 states: తమిళనాడులో..

గవర్నర్ ఎన్ ఆర్ రవిని రీకాల్ చేయాలని తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరుతూ ఒక తీర్మానం చేసింది. కోయంబత్తూరు కారు కేసుకు సంబంధించి, అలాగే పలు ఇతర సందర్భాల్లోనూ మత విద్వేషాలు పెరిగేలా గవర్నర్ వ్యాఖ్యలు చేశారని డీఎంకే ఆరోపిస్తోంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం పంపిన అనేక బిల్లులను గవర్నర్ అనవసరంగా, కారణం లేకుండా పెండింగ్ లో పెట్టారని ఆరోపించింది. అందులో ఒకటి నీట్(NEET) పరిధిలోనుంచి తమిళనాడును తప్పిస్తూ రూపొందించిన బిల్లు కూడా ఉంది.

తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.