Social media influencers : ఇన్​ఫ్లుయెన్సర్​లకు షాక్​.. అమల్లోకి కొత్త రూల్స్​- పాటించకపోతే ఇక అంతే!-government of india imposed several new rules for social media influencers ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /   Government Of India Imposed Several New Rules For Social Media Influencers

Social media influencers : ఇన్​ఫ్లుయెన్సర్​లకు షాక్​.. అమల్లోకి కొత్త రూల్స్​- పాటించకపోతే ఇక అంతే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 21, 2023 07:14 AM IST

New rules for Social media influencers : మీరొక సోషల్​ మీడియా ఇన్​ఫ్లుయెన్సరా? అయితే మీకు అలర్ట్​! పలు కీలక మర్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే.. భారీ జరిమానా విధించనుంది.

ఇన్​ఫ్లుయెన్సర్​లకు షాక్​.. కొత్త రూల్స్​ పాటించకపోతే భారీ జరిమానా!
ఇన్​ఫ్లుయెన్సర్​లకు షాక్​.. కొత్త రూల్స్​ పాటించకపోతే భారీ జరిమానా! (AP)

New rules for Social media influencers : ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతున్న సోషల్​ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్​ మార్కెట్​ను నియంత్రించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు సోషల్​ ఇన్​ఫ్లుయెన్సర్​ల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. బ్రాండ్​ అసోసియేషన్​పై డిస్​క్లోజర్లు, కస్టమర్ల రక్షణ వంటి నిబంధనలు ఇందులో ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు సైతం తీసుకోవాలని నిర్ణయించింది కేంద్రం. రూ. 50లక్షల జరిమానాతో పాటు కనీసం 6 నెలల పాటు బ్రాండ్​ల పబ్లిసిటీకి దూరంగా ఉండాలని నిబంధనల్లో పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

సోషల్​ మీడియో ఇన్​ఫ్లుయెన్స్​లు పాటించాల్సిన రూల్స్​..

అడ్వటైజర్​- సెలబ్రెటీ/ ఇన్​ఫ్లుయెన్సర్​ల మధ్య "మెటీరియల్​ కనెక్షన్​" ఉంటే.. అందుకు సంబంధించిన డిస్​క్లోజర్​ను కచ్చితంగా పబ్లీష్​ చేయాలని సీసీపీఏ (సెంట్రల్​ కన్జ్యూమర్​ ప్రొటెక్షన్​ అథారిటీ) చీఫ్​ నిధి ఖారే తెలిపారు.

Social media influencers new rules : సోషల్​ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్​లకు పలు నిబంధనలు తీసుకురావాలని.. గతేడాది సెప్టెంబర్​ నుంచే ప్రణాళికలు రచిస్తోంది కేంద్రం. తాజాగా వాటిని అమలు చేసింది. ఈ సెక్టార్​కు డిమాండ్​ విపరీతంగా పెరుగుతుండటం ఇందుకు కారణం. సోషల్​ ఇన్​ఫ్లుయెన్సర్​లకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. దానిని ఉపయోగించుకుని.. తమ బ్రాండ్​, ప్రొడక్టులను ప్రచారం చేసుకోవాలని వివిధ సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీగా ఖర్చు చేస్తున్నాయి. 2025 నాటికి.. సోషల్​ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్ మార్కెట్​ రూ. 2,800కోట్లకు చేరుతుందని అంచనాలు ఉన్నాయి.

ఈ మార్గదర్శకాలు ఎవరికి వర్తిస్తాయంటే..

Social media influencers guidelines : ఆడియెన్స్​ 'కొనుగోలు నిర్ణయాలను' ప్రభావితం చేయగలిగే సామర్థ్యం ఉన్న ప్రతి వ్యక్తికి ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని ఖారే తెలిపారు.

"ఎండోర్స్​మెంట్​కు సంబంధించిన డిస్​క్లోజర్​ చాలా స్పష్టంగా ఉండాలి. మిస్​ అయ్యే ఛాన్సే లేకుండా డిస్​క్లోజ్​ చేయాలి. ఫొటోల్లో ఎండోర్స్​మెంట్​ చేయాలంటే.. ఆ ఇమేజ్​పై డిస్​క్లోజర్​ను సూపర్​ఇంపోజ్​ చేయాలి. వీడియోలో అయితే.. కేవలం డిస్క్రిప్షన్​లో పెట్టి వదిలేయకూడదు. వీడియోలోనూ డిస్​క్లోజ్​ చేయాల్సి ఉంటుంది. లైవ్​స్ట్రీమ్​లో అయితే.. టిక్కర్​ రూపంలో ఎప్పుడూ డిస్​క్లోజ్​ చేస్తూనే ఉండాలి. లైవ్​స్ట్రీమ్​ అయ్యేంత వరకు టిక్కర్​ ఉండాల్సిందే," అని ఖారే స్పష్టం చేశారు.

ఇవన్నీ.. మెటీరియల్​ కనెక్షన్​లే..!

Social media influencers impact on youth : "మెటీరియల్​ కనెక్షన్​ అంటే.. డైరక్ట్​గా లబ్ధిపొందటం ఒక్కటే కాదు. మొనేటరీ, ఇతర కాంపెన్సేషన్లు కూడా ఇందులోకి వస్తాయి. ప్రొడక్టులు ఫ్రీగా ఇవ్వడం లేదా కండీషన్లు లేకుండా ఇవ్వడం కూడా మెటీరియల్​ కనెక్షన్​ కిందకే వస్తుంది. ట్రిప్స్​, హోటల్​ స్టే, మీడియా బార్టర్స్​, కవరేజ్​, అవార్డ్​లు, ఫ్యామిలీ-పర్శనల్​ ఎంప్లాయిమెంట్​ రిలేషన్​షిప్​ వంటివి కూడా ఈ జాబితాలోకి వస్తాయి," అని ఖారే తెలిపారు. ఈ మార్గదర్శకాలను.. 2019 కన్జ్యూమర్​ ప్రొటెక్షన్​ యాక్ట్​లో భాగంగా జారీ చేసినట్టు వివరించారు.

పర్సనల్​ కేర్​, క్లోథింగ్​ సెగ్మెంట్​లపై ఈ నిబంధనల ప్రభావం భారీగా పడనుందని కన్జ్యూమర్​ అఫైర్స్​ సెక్రటరీ రోహిత్​ కుమార్​ సింగ్​ అభిప్రాయపడ్డారు. సోషల్​ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్ ప్రమోట్​ చేస్తూన్న బ్రాండ్స్​లో అత్యధిక వాటే ఈ సెగ్మెంట్​లదే అని పేర్కొన్నారు. "ఇన్​ఫ్లుయెన్సర్​లు.. డబ్బులు తీసుకుని బ్రాండ్​ను ప్రమోట్​ చేస్తున్నారా? లేదా? అన్న విషయం వీక్షకులకు కచ్చితంగా తెలియాలి. అప్పుడే వారి కొనుగోలు నిర్ణయాలు మార్చుకోవచ్చు," అని ఆయన తెలిపారు.

Social media influencers : ఈ నిబంధనలను ఉల్లంఘించే సోషల్​ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్​పై న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఈ నిబంధనలు రూపొందించింది ప్రభుత్వం. తప్పుదోవ పట్టించే విధంగా యాడ్స్​ ఉంటే.. మరింత కఠిన శిక్షలు అమలవుతాయి!

IPL_Entry_Point

సంబంధిత కథనం