Students design 'Shiva Stick': అంధుల కోసం ప్రత్యేకంగా ‘శివ స్టిక్’-gorakhpur b tech students design shiva stick to enable visually impaired visit religious places ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Gorakhpur: B.tech Students Design 'Shiva Stick' To Enable Visually Impaired Visit Religious Places

Students design 'Shiva Stick': అంధుల కోసం ప్రత్యేకంగా ‘శివ స్టిక్’

HT Telugu Desk HT Telugu
Feb 15, 2023 06:59 PM IST

Students design 'Shiva Stick' గోరఖ్ పూర్ లోని మదన్ మోహన్ మాలవీయ ఇంజినీరింగ్ కళాశాలలో బీ టెక్ చదువుతున్న విద్యార్థినులు ‘శివ స్టిక్(Shiva Stick)’ అంధులకు ఉపయోగపడే ఒక స్టిక్ ను రూపొందించారు. ఈ స్టిక్ సాయంతో అంధులు దేశంలోని వివిధ పుణ్య క్షేత్రాల సందర్శన ఈజీగా చేయగలుగుతారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Shiva Stick for visually impaired: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇచ్చిన డిజిటల్ ఇండియా (Digital India) నినాదం స్ఫూర్తితో గోరఖ్ పూర్ లోని మదన్ మోహన్ మాలవీయ ఇంజినీరింగ్ కళాశాలలో బీ టెక్ చదువుతున్న విద్యార్థినులు అంధులకు ఉపయోగపడే ఒక స్టిక్ ను రూపొందించారు. ఆ స్మార్ట్ స్టిక్ కు ‘శివ స్టిక్(Shiva Stick)’ అని పేరు పెట్టారు. ఈ డిజిటల్ స్టిక్ (digital stick) సాయంతో అంధులు ఇబ్బందులు పడకుండా దేవాలయాలను సందర్శించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Shiva Stick for visually impaired: ఎవరి సాయం లేకుండానే

ఈ ‘శివ స్టిక్ (Shiva Stick)’ సాయంతో అంధులు దేశవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక ప్రదేశాలను ఎవరి సాయం లేకుండానే సందర్శించవచ్చు. ఈ ‘శివ స్టిక్(Shiva Stick)’ లో ఇన్ బిల్ట్ సెన్సర్ (in-built sensor), వాయిస్ రికార్డింగ్ చిప్ (voice recording chip), ట్రాన్స్ మిటర్ (transmitter), ఫ్లాష్ లైట్ (flashlight), 9 వోల్డ్ బ్యాటరీ లను అమర్చారు. ఈ స్టిక్ కు అమర్చిన స్విచ్ ను ఆన్ చేసి, డెస్టినేషన్ కు సంబంధించిన ఆదేశాలు ఇవ్వగానే, ప్రయాణానికి సంబంధించిన సూచనలు ఇస్తుంది.

Digital India డిజిటల్ ఇండియా స్ఫూర్తితో

అంధులు ఎవరిపైనా ఆధారపడకుండా, స్వయంగా, స్వతంత్రంగా తమకు నచ్చిన ప్రదేశానికి వెళ్లడానికి ఈ స్టిక్ (Shiva Stick) ఎంతో ఉపయోగపడుతుందని ఆ విద్యార్థినులు తెలిపారు. స్టిక్ కు ఉన్న ఫ్లాష్ లైట్ ద్వారా ఇతరులు వీరిని గుర్తించడానికి వీలవుతుందని వివరించారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన డిజిటల్ ఇండియా (Digital India)స్ఫూర్తితో ఈ స్టిక్ ను రూపొందించామని వెల్లడించారు. ఈ శివ స్టిక్ (Shiva Stick) ను రూపొందించడానికి తమకు వారం రోజుల సమయం మాత్రమే పట్టిందని, ఇందుకు రూ. 500 ఖర్చు అయిందని వివరించారు. శివరాత్రి పర్వదినం దగ్గరలో ఉన్నందున ఈ స్టిక్ కు శివ స్టిక్ (Shiva Stick) అని పేరు పెట్టామన్నారు.

IPL_Entry_Point

టాపిక్