Google AI-based tool: భారత్ లోని రైతుల కోసం ఏఐ ఆధారిత టూల్ ను డెవలప్ చేసిన గూగుల్
భారత్ లోని రైతుల కోసం కృత్రిమ మేథ ఆధారిత టూల్ ను గూగుల్ డెవల్ చేసింది. అగ్రికల్చరల్ ల్యాండ్ స్కేప్ అండర్ స్టాండింగ్ (ALU) అనే పేరుతో ఉన్న ఈ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్ హై రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్, మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి రైతులకు అవసరమైన సమాచారం అందిస్తుంది.

రైతులకు వ్యవసాయ సమాచారాన్ని అందించడానికి, పంట దిగుబడులను పెంచడానికి అగ్రికల్చరల్ ల్యాండ్ స్కేప్ అండర్ స్టాండింగ్ (ALU) టూల్ ను గూగుల్ ప్రవేశపెట్టింది. వ్యవసాయ పద్ధతులను డేటా ఆధారితం చేయడానికి ఉద్దేశించిన ఏఐ ఆధారిత టూల్ ఇది.
గూగుల్ ఐ/ఓ కనెక్ట్ ఈవెంట్ లో..
అగ్రికల్చరల్ ల్యాండ్ స్కేప్ అండర్ స్టాండింగ్ (ALU) టూల్ భారతీయ వ్యవసాయ భూభాగానికి అవసరమైన సమాచారాన్ని గ్రాన్యులర్ స్థాయిలో అందిస్తుందని గూగుల్ తెలిపింది. హై రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజరీ, పొలాల మధ్య సరిహద్దులు గీయడానికి మెషిన్ లెర్నింగ్, కరవు సన్నద్ధత, నీటి పారుదల, మార్కెట్ యాక్సెస్ తదితర సమాచారాన్ని దీని ద్వారా పొందవచ్చు. బెంగళూరులో ఇటీవల జరిగిన గూగుల్ ఐ/ఓ కనెక్ట్ కార్యక్రమంలో ఈ విషయాన్ని గూగుల్ ప్రకటించింది.
పంట రకం, పొలం పరిమాణం, నీటి లభ్యత
వ్యవసాయభూమి అవగాహన సాధనం పంట రకం, పొలం పరిమాణం, నీటి లభ్యత, రోడ్ యాక్సెస్, సమీపంలోని మార్కెట్ గురించి వివరణాత్మక సమాచారాన్ని కూడా ఈ టూల్ అందిస్తుంది. ఆంత్రో కృషి టీమ్, డిజిటల్ అగ్రిస్టాక్ సహకారంతో దీనిని గూగల్ క్లౌడ్ లో రూపొందించారు. అగ్రికల్చర్ ల్యాండ్ స్కేప్ సమాచారాన్ని ఇప్పటికే నింజాకార్ట్, స్కైమెట్, టీమ్-అప్, ఐఐటీ బాంబే, భారత ప్రభుత్వం ఉపయోగిస్తున్నాయి.
ప్రభుత్వ ఏఐ ఆధారిత చాట్ బాట్ కిసాన్ మిత్ర
కృత్రిమ మేధస్సు, రిమోట్ సెన్సింగ్ ఉపయోగించి దేశవ్యాప్తంగా వ్యక్తిగత వ్యవసాయ క్షేత్రాలను దీని ద్వారా ట్రాక్ చేయవచ్చు. తద్వారా పెట్టుబడి, సబ్సిడీలను పొందడం నుండి దిగుబడులను మెరుగుపరచడం వరకు రైతులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను పరిష్కారం పొందవచ్చని గూగుల్ తెలిపింది. వ్యవసాయ దిగుబడులను మెరుగుపరచడానికి ప్రభుత్వం కూడా కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తోంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం వంటి రైతు ప్రయోజనకర ప్రభుత్వ కార్యక్రమాల గురించి రైతులు తెలుసుకోవడానికి ప్రభుత్వం కిసాన్ మిత్ర అనే ఏఐ ఆధారిత చాట్ బాట్ ను బహుళ భారతీయ భాషల్లో ప్రవేశపెట్టింది.
నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టం
చీడపీడల కారణంగా పంటలు నష్టపోయే సమస్యను పరిష్కరించడానికి నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టం (ఎన్పీఎస్ఎస్)ను ప్రారంభించారు. పంట సమస్యలను గుర్తించడానికి ఈ వ్యవస్థ కృత్రిమ మేధ మరియు మెషిన్ లెర్నింగ్ ను ఉపయోగిస్తుంది. ప్రభుత్వం వరి, గోధుమల కోసం క్షేత్ర స్థాయి ఛాయాచిత్రాలు, పంట ఆరోగ్య మదింపు నివేదికలను ఉపయోగించి కృత్రిమ మేధ విశ్లేషణలను ఉపయోగిస్తుంది. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సహకారంతో ప్రాజెక్ట్ వాణిని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లోని సమాచారంతో 58 భాషల్లో ఉన్న 14,000 గంటల ప్రసంగానికి సంబంధించిన డేటా ఇందులో ఉంటుంది. భారతీయ భాషల కోసం ప్రత్యేకంగా ఈ టూల్ ను రూపొందించారు. గతంలో ఎన్నడూ అంచనా వేయని భాషలతో సహా 29 భాషలను ఇది కవర్ చేస్తుంది.