Google Layoff: స్టార్ పర్ఫార్మర్ అవార్డు ఇచ్చి.. వెంటనే ఉద్యోగంలో నుంచి తీసేసి.. “ఎందుకిలా?”-google india lays off employee after awarding star performance he questions why me ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Google India Lays Off Employee After Awarding Star Performance He Questions Why Me

Google Layoff: స్టార్ పర్ఫార్మర్ అవార్డు ఇచ్చి.. వెంటనే ఉద్యోగంలో నుంచి తీసేసి.. “ఎందుకిలా?”

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 28, 2023 07:40 AM IST

Google Layoff: గూగుల్‍లో ఉద్యోగం కోల్పోయిన ఆ వ్యక్తి తన అనుభవాన్ని లింక్డ్ఇన్‍లో పంచుకున్నారు. స్టార్ పర్ఫార్మర్‌గా అవార్డు అందుకున్న తనను కంపెనీ ఎందుకు తొలగించిందో అర్థం కావడం లేదంటూ రాసుకొచ్చారు.

Google Layoff: స్టార్ పర్ఫార్మర్ అవార్డు ఇచ్చి.. వెంటనే ఉద్యోగంలో నుంచి తీసేసి.. (Photo: Linkedin/Harsh Vijayvargiya)
Google Layoff: స్టార్ పర్ఫార్మర్ అవార్డు ఇచ్చి.. వెంటనే ఉద్యోగంలో నుంచి తీసేసి.. (Photo: Linkedin/Harsh Vijayvargiya)

Google Layoff: టెక్నాలజీ రంగంలో కొన్ని నెలలుగా ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది. దిగ్గజ కంపెనీలు కూడా వేలాది మంది ఎంప్లాయిస్‍ను తీసేస్తున్నాయి. కఠిన నిర్ణయాలతో ఉద్యోగుల్లో దడపుట్టిస్తున్నాయి. ఈ జాబితాలో టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ (Google) కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 12వేల మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తోంది గూగుల్. ఇందులో భాగంగా ఇటీవల ఇండియాలో 450 మంది ఉద్యోగులను ఆ సంస్థ తొలగించింది. సడన్‍గా వచ్చిన ఈ నిర్ణయంతో తొలగింపునకు గురైన ఉద్యోగులు షాకయ్యారు. తమ బాధను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే హర్ష్ విజయ్‍వర్గీయ అనే ఉద్యోగి కూడా గూగుల్‍లో ఉద్యోగం కోల్పోయారు. స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ ది మంత్ ఇచ్చాక ఎందుకు తొలగించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

“నేనే ఎందుకు?”

Google Layoff: హైదరాబాద్‍కు చెందిన హర్ష్ అనే గూగుల్ ఇండియా ఉద్యోగి లింక్డ్ఇన్‍లో పోస్ట్ చేశారు. గూగుల్ తనను ఉద్యోగంలో నుంచి ఎందుకు తొలగించిందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. “శనివారం ఉదయం గూగుల్ ఆపరేషన్స్ సెంటర్ నుంచి వచ్చిన ఈ-మెయిల్ నోటిఫికేషన్ పాపప్ చూసినప్పుడు నా గుండె స్పందన తడబడింది. నేను కూడా లేఆఫ్‍తో ప్రభావితమయ్యా. అత్యంత విలువైన కంపెనీల్లో గూగుల్ ఒకటి. గూగుల్‍లో పని చేస్తుండడం ఎప్పుడూ గర్వంగా భావించా. ఈ నెలకు నేను స్టార్ పర్ఫార్మర్‌గా ఉన్నా. కానీ నేను ఎందుకు? (లేఆఫ్) అనే ప్రశ్నకు నాకు ముందుగా తోచింది. దానికి ఆన్సర్ నాకు ఏమీ కనిపించడం లేదు” అని లింక్డ్ఇన్ పోస్టులో హర్ష్ పోస్ట్ చేశారు.

Google Layoff: కాగా, తనకు రెండు నెలల నుంచి జీతం సగమే వస్తోందని, తన ఫైనాన్షియల్ ప్లాన్‍లన్నీ చెదిరిపోతాయని రాసుకొచ్చారు. ఇది రాయడానికి శక్తిని కూడగట్టుకునేందుకు కూడా రెండు రోజుల సమయం పట్టిందని, ఇక జీవనం కోసం మళ్లీ పోరాడాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగం కోసం సూచనలు ఇవ్వాలని లింక్డ్ఇన్‍లోని ఇతర యూజర్లను కోరారు.

Google Layoff: గూగుల్‍లో ఇటీవలే 5వ యానివర్సరీ చేసుకున్న గురుగ్రామ్‌కు చెందిన ఆకృతి వాలియా కూడా ఇటీవల ఉద్యోగం కోల్పోయారు. ఆమె కూడా తన అనుభవాలను పంచుకున్నారు.

Google Layoff: ప్రపంచవ్యాప్తంగా సుమారు 12వేల మంది ఉద్యోగులను తీసివేయనున్నట్టు గూగుల్ పేరెంట్ కంపెనీ అల్ఫాబెట్ ఈ ఏడాది ప్రారంభంలో వెల్లడించింది. మొత్తంగా కంపెనీలో 6శాతం మంది సిబ్బందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. సిస్టమ్ యాక్సెస్ పోయాక తమ ఉద్యోగం పోయిందని కొందరు ఉద్యోగులు గ్రహిస్తున్నారు.

ఇక మరో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా సంస్థలోని సుమారు 11వేల మంది ఉద్యోగులను తీసేయనున్నట్టు చెప్పింది. అమెజాన్ ఏకంగా 18వేల మందిని లేఆఫ్ చేసింది. ఫేస్‍బుక్ పేరెంట్ కంపెనీ మెటా 13 శాతం అంటే సుమారు 11వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఇలా పదుల సంఖ్యలో భారీ సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. లక్షలాది మంది ఉద్యోగ,లు కోల్పోయారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్