PM Kisan Yojana : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్, పీఎం కిసాన్ డబ్బులు పడేది ఎప్పుడంటే?
PM Kisan Yojana : రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ నిధులు ఈ నెల 24న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. 19వ విడతలో భాగంగా రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు.

PM Kisan Yojana : రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాతలకు పెట్టుబడి సాయంగా అందించే పీఎం కిసాన్ నిధుల విడుదలపై అప్డేట్ ఇచ్చింది. పీఎం కిసాన్ పథకం కింద 19వ విడత నిధుల విడుదలకు తేదీ ఖరారు చేసింది. ఫిబ్రవరి 24న పీఎం కిసాన్ నిధులు రూ.2 వేలు చొప్పున రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు. బిహార్ భాగల్ పూర్‌లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పెట్టుబడి సాయం నిధులను విడుదల చేయనున్నారు.
మీ పేరు ఇలా చెక్ చేసుకోండి
19వ విడతలో దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో నగదు జమచేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. పీఎం కిసాన్ నిధులు పొందేందుకు రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. అలాగే ఇ-కేవైసీ పూర్తి చేసి ఉండాలి. పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందో లేదో తనిఖీకి https://pmkisan.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు. ఈ వివరాలు పొందడానికి రైతు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే పీఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు.
పీఎం కిసాన్ దరఖాస్తు విధానం
Step1 : పీఎం కిసాన్ యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in లో 'ఫార్మర్ కార్నర్' పై క్లిక్ చేయండి.
Step2 : 'New Farmer Registration'పై క్లిక్ చేసి ఆధార్ నంబర్ నమోదు చేయాలి.
Step3 : అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి Yes option పై క్లిక్ చేయండి
Step4 : పీఎం కిసాన్ దరఖాస్తు ఫారమ్ పూర్తి చేసి సమాచారాన్ని సేవ్ చేయండి. దానిని ప్రింటౌట్ కూడా తీసుకోండి.
2. OTP ఆధారిత e-KYC పై క్లిక్ చేయండి.
3. రైతు 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి
4. 'GET OTP' బటన్ క్లిక్ చేయండి
5. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
6. ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి సబ్మిట్ పై నమోదు చేయండి.
ఈ-కేవైసీ చేయించుకోకపోతే పీఎం కిసాన్‌తో తదుపరి విడత ఆర్థిక సాయం పొందలేరు. ఈ-కేవైసీ కోసం ముందుగా ఆన్ లైన్ లో ఓటీపీ, ఆ తర్వాత సీఎస్సీ కేంద్రాల్లో వేలిముద్ర వేసి, అనంతరం ఫేస్ ఐడీ స్కాన్ చేయాల్సి ఉంటుంది.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN Yojana) పథకాన్ని 2019లో ప్రధాని మోదీ ప్రారంభించారు. చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడి సాయంగా ఏటా రూ.6000 వేలు మూడు వాయిదాల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది.
పీఎం కిసాన్ నిధి స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా?
పీఎం కిసాన్ పోర్టల్ https://pmkisan.gov.in/ ని సందర్శించి, బెనిఫిషియరీ జాబితాను, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత స్టేటస్ ను చెక్ చేయవచ్చు. మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే హెల్ప్‌లైన్ (1800-115-5525)ని సంప్రదించవచ్చు.
సంబంధిత కథనం