Gold rate today : స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే-gold rate today on august 6 2022 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Gold Rate Today On August 6 2022

Gold rate today : స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే

మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (PTI)

Gold rate today : దేశంలో పసిడి, వెండి ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. ఆ లెక్కలు ఇలా ఉన్నాయి.

Gold rate today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 150 పెరిగి.. రూ. 47,650కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 47,500గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 160 పెరిగి.. రూ. 51,980కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 51,820గా ఉండేది.

ట్రెండింగ్ వార్తలు

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం రేట్లు శనివారం స్వల్పంగా పెరిగాయి. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,650 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 51,980గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 48,650గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 53,070గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 47,680గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 52,010గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 47,650గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,980గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, చైనా-తైవాన్​ అనిశ్చితులు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి రూ. 50 పెరిగి.. 5,820గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 500 పెరిగి.. రూ. 58,200కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 57,700గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 63,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాల్​ 58,200.. బెంగళూరులో 63,600.. ముంబైలో 58,200.. చెన్నైలో 63,600గా ఉన్నాయి.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు (శుక్రవారం) పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 130 పెరిగి.. రూ 22,810కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 22,680గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 22,810గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం