Gold rate today : మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇవే..
Gold rate today : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. మీ నగరాల్లోని తాజా ధరల కోసం ఇక్కడ చూడండి.
Gold rate today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి ధర(22క్యారెట్లు) ప్రస్తుతం రూ. 46,190గా ఉంది. సోమవారం కూడా బంగారం ధర రూ. 46,190గానే ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10గ్రాములు) రూ. 50,390గా ఉంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,190 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 50,390గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,880గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,140గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల బంగారం రూ. 46,270గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 50,470గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,190గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,390గా నమోదైంది. విజయవాడ, వైజాగ్లో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, రూపాయి విలువ పతనం.. బంగారం ధరల హెచ్చుతగ్గులకు కారణాలుగా తెలుస్తోంది.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. కేజీ వెండి రూ. 400 పెరిగి.. రూ. 56,000గా ఉంది. సోమవారం కేజీ వెండి ధర రూ. 55,600గా ఉండేది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 61,700 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాల్ 56,000.. బెంగళూరులో 61,700.. ముంబైలో 56,000.. చెన్నైలో 61,700గా ఉన్నాయి.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు సైతం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 21,820కి చేరింది. కాగా.. సోమవారం కూడా ఇదే ధర పలికింది.
ఇక హైదరాబాద్లో ప్రస్తుతం ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 21,820గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం