Gold rates today | మూడు నెలల కనిష్ఠానికి పసిడి ధరలు.. నేటి లెక్కలివే..-gold and silver rates today gold prices today fall to lowest in 3 months ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Gold And Silver Rates Today: Gold Prices Today Fall To Lowest In 3 Months

Gold rates today | మూడు నెలల కనిష్ఠానికి పసిడి ధరలు.. నేటి లెక్కలివే..

HT Telugu Desk HT Telugu
May 13, 2022 01:17 PM IST

Gold and silver rates today | దేశీయ మార్కెట్​లో బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. నేటి లెక్కలకు సంబంధించిన వివరాలు..

దిగొచ్చిన బంగారం ధర
దిగొచ్చిన బంగారం ధర (REUTERS/file)

Gold and silver rates today | దేశీయ మార్కెట్లలో పసిడి ధరలు మరింత దిగొచ్చాయి. ఎమ్​సీఎక్స్​ గోల్ట్​ ఫ్యూచర్స్​.. 0,03శాతం మేర పడ్డాయి. ఫలితంగా 10గ్రాముల పసిడి ధర రూ. 50,158గా ఉంది. ఇది మూడు నెలల కనిష్ఠ స్థాయి.

ట్రెండింగ్ వార్తలు

గత సెషన్​లో గోల్డ్​ ధరలు 1.2శాతం మేరపడ్డాయి. ఈ వారంలో ఇప్పటివరకు గోల్డ్​ ధర రూ. 1,500 మేర దిగొచ్చింది(10గ్రాములు). ఫలితంగా.. రష్యా ఉక్రెయిన్​ యుద్ధం కారణంగా ఏర్పడిన ర్యాలీ( ఫిబ్రవరి నుంచి)లో లాభాలన్నీ ఉడ్చుకుపోయాయి. మార్చ్​ నెల తొలి వారంలో బంగారం ధర రూ. 56,000 మార్క్​ను అందుకుంది.

అంతర్జాతీయ మార్కెట్​లో కూడా అదే పరిస్థితి. అమెరికా డాలర్​ బలపడటంతో పసిడికి డిమాండ్​ తగ్గుతోంది. ఒక ఔన్సు స్పాట్​ గోల్డ్​ 0.1శాతం పడి 1,829.54 డాలర్లకు వచ్చింది.

"డాలర్​ ఇండెక్స్​ 20ఏళ్ల గరిష్ఠానికి చేరడంతో గోల్డ్​ ధరలు పడుతున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి ఉన్నప్పుడు.. గోల్డ్​లో పెట్టుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. కానీ బంగారం డిమాండ్​ పడింది. అంతర్జాతీయ మార్కెటలలో లిక్విడిటీ లేకపోవడం ఇందుకు కారణం కావచ్చు. అన్నిచోట్ల అమ్మకాల జోరు కొనసాగుతోంది. బంగారం ధరలు ఇంకా పడే అవకాశం లేకపోలేదు," అని యాక్సిస్​ సెక్యూరిటీస్​కు చెందిన ప్రీతమ్​ పట్నాయక్​ అన్నారు.

వెండి ఇలా..

మరోవైపు దేశీయ మార్కెట్​లో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 0.3శాతం వృద్ధి చెంది కేజీకి రూ. 58,920కు చేరింది. గత సెషన్​లో వెండి 3.3శాతం(రూ. 2,000) మేర పడింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్