Telugu News  /  National International  /  Gold And Silver Prices Today 2022 February 24 In India
బంగారం ధర
బంగారం ధర (REUTERS)

Gold and Silver rates Today| పడిపోయిన పసిడి ధరలు.. స్థిరంగా కొనసాగుతున్న వెండి

24 February 2022, 7:21 ISTHT Telugu Desk
24 February 2022, 7:21 IST

ఈ రోజు(ఫిబ్రవరి 24) బంగారం ధర కాస్త తగ్గింది. ఇదే సమయంలో వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 తగ్గి 46,000లు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.284లు తగ్గి రూ.50,180లకు చేరింది.

గత కొన్నిరోజులుగా బంగారం, వెండి ధరలు రోజు రోజుకు క్రమంగా పెరుగుతూ షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా పసిడి ఇటీవల కాలంలో నిత్యం పెరుగుతూ వినియోగదారులకు అందని ద్రాక్షగా మారింది. అయితే నిన్నటితో(బుధవారం) పోలిస్తే నేడు(గురువారం-2022 ఫిబ్రవరి 24) బంగారం ధర కాస్త తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,000లుగా ఉంది. ఇదే 8 గ్రాముల బంగారం అయితే రూ.36,800లుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వచ్చేసి 50,180లుగా ఉంది. 8 గ్రాముల 24 క్యారెట్ల పసిడి వచ్చేసి రూ.40,144లుగా కొనసాగుతుంది. మొత్తం మీద 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2250లు, 24 క్యారెట్ల పసిడిపై రూ.280 వరకు ధర తగ్గింది.

ట్రెండింగ్ వార్తలు

నగరాల వారీగా బంగారం ధర..

దేశ రాజధానీ దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,260లుగా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.50,180లుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 46,000లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.50,180లుగా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 47,350లు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర వచ్చేసి రూ.51,660లుగా ఉంది. మిగిలిన నగరాలతో పోలిస్తే చెన్నైలో కాస్త ఎక్కువగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.46,000లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.50,280లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఈ విధంగా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర వచ్చేసి రూ.50,180ల వద్ద కొనసాగుతుంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.46,000లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.50,180లుగా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.45,000లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.50,180లుగా కొనసాగుతుంది.

దేశీయంగా కిలో వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. దిల్లీలో కేజీ వెండి ధర రూ.64,300ల వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో రూ.69,000లు ఉండగా.. బెంగళూరులో మాత్రం కిలో వెండి రూ.70,000లుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.70,000లు, విజయవాడలో రూ.70,000లు, విశాఖపట్నంలోనూ రూ.70,000లుగా ఉంది.