Telugu News  /  National International  /  Gold And Silver Price Increased In Festival Season
బంగారం ధరలకు మళ్లీ రెక్కలు
బంగారం ధరలకు మళ్లీ రెక్కలు

Gold and Silver Price పెరిగిన పుత్తడి ధరలు…

04 October 2022, 9:16 ISTHT Telugu Desk
04 October 2022, 9:16 IST

Gold and Silver Price today రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత వారం కాస్త తగ్గుముఖం పట్టినా గ్రాముకు రూ.350కు పైగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 51,110గా ఉంది.

Gold silver price today బంగారం ధరల్లో తరచూ హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వంటి అంశాలతో పాటు దేశీయ కొనుగోళ్ళ కారణంగా గత వారంలో ధరలు పెరిగాయి. గత వారం ముగింపుతో పోలిస్తే మంగళవారం ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారంపై రూ.350 పెరిగింది. 24 క్యారెట్లపై రూ.380 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 51,110గా నమోదైంది.

ట్రెండింగ్ వార్తలు

22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,850 వద్ద కొనసాగుతోంది. ఇవాళ కిలో వెండిపై రూ.100 తగ్గి, హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.62వేలుగా ఉంది.

Gold and silver price: ఆంధ్రప్రదేశ్‌లో ఇలా.....

Gold and silver price : విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.46,850గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 51,110గా నమోదైంది. వెండి ధర కిలో రూ.62వేల వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850గా ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,140గా ఉంది.

Gold and silver price: పలు నగరాల్లో ఇలా.....

gold and silver rate దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం నమోదవుతోంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47వేలుగా ఉంటే… 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,280 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,850గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330 వద్ద ఉంది. ఇక కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 51,230గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47వేల వద్ద కొనసాగుతోంది.

Platinum Price today: ప్లాటినం ధరలు ఇలా...

ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 170 చొప్పున తగ్గింది. హైదరాబాద్‌లో ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 22,510గా ఉంది. విజయవాడలో, విశాఖపట్నంలోనూ ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 22,510గా ఉంది.

టాపిక్