Rajasthan father sold daughter : రాజస్థాన్లో అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పులు తీర్చలేకపోతుండటంతో.. ఇంటి ఆడబిడ్డలను కుటుంబాలు అమ్ముకోవాల్సి వస్తోంది. అంతేకాకుండా.. కుటుంబంలోని మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. కుల పంచాయతీ పెద్దల ఆదేశాలతో ఇవన్నీ జరుగుతున్నాయి!
రాజస్థాన్లో ఇలాంటి ఘటనలు అనాదిగా జరుగుతూనే ఉన్నాయి! తాజాగా.. ఓ వ్యక్తి అప్పు తీర్చలేకపోవడంతో.. తన 8ఏళ్ల ఆడబిడ్డను అమ్ముకున్నాడని ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. స్టాంప్ పేపర్ల మీద అధికారిక ఒప్పందాలు చేసుకుని మరీ అమ్మకాలు జరుపుతుండటం గమనార్హం.
Rajasthan caste councils : రాజస్థాన్లో ఇప్పటికీ కాస్ట్ కౌన్సిల్స్(కుల పంచాయతీ)లు ఉన్నాయి. ఏదైనా సమస్యను పరిష్కరించుకోవడం కోసం సాధారణంగా పోలీసులు వద్దకు వెళుతూ ఉంటారు. కానీ రాజస్థాన్లోని అనేక గ్రామాల ప్రజలు పోలీసుల వద్దకు కాకుండా.. ఇలా కాస్ట్ కౌన్సిల్స్ వద్దకు వెళతారు. ఈ నేపథ్యంలో పంచాయతీ పెద్దలు.. ఆడబిడ్డల అమ్మకాలు, మహిళలపై అత్యాచారాలు వంటి తీర్పులు ఇస్తున్నారు!
రూ. 15లక్షల అప్పు తీర్చలేకపోతున్న ఓ వ్యక్తి కేసు.. ఇటీవలే కుల పంచాయతీ పెద్దల వద్దకు వెళ్లింది. ఈ క్రమంలోనే అతి 12ఏళ్ల ఆడబిడ్డను అమ్మాలని తీర్పునిచ్చారు ఆ పెద్దలు.
Rajasthan crime news : మరో ఘటనలో ఓ బాలికను రూ. 6లక్షలకు ఆ తండ్రి అమ్ముకోవాల్సి వచ్చింది. అలా.. ఆ బాలిక ఇప్పటికే మూడుసార్లు చేతులు మారింది! అంతేకాకుండా నాలుగుసార్లు గర్భం కూడా దాల్చింది. ఆ బాలికతో పాటు.. తన ఇంటిని కూడా అమ్ముకుని ఆ తండ్రి రూ. 6లక్షల అప్పును తీర్చుకోవాల్సి వచ్చింది. అనారోగ్యంతో ఉన్న భార్యకు చికిత్స కోసం అప్పు చేశాడు ఆ వ్యక్తి. అప్పు తీసుకుని వైద్యం ఇప్పించినా.. ఆ మహిళ ప్రాణాలు దక్కలేదు. చివరికి.. అప్పు తీర్చలేకే.. అడబిడ్డను కూడా అమ్మేసుకున్నాడు.
జాతీయ మీడియాలో వచ్చిన కథనంపై జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. ఇలా వేలం పాటలో కొనుగోలు చేస్తున్న బాలికలను విదేశాలకు ట్రాఫికింగ్ చేస్తున్నారని పేర్కొంది. లైంగికంగా హింసిస్తున్నారని, బానిసత్వంలోకి నెడుతున్నారని వివరించింది.
Father sells daughter to clear debt : మీడియాలో వచ్చిన కథలు నిజమైతే.. మానవ హక్కులకు తీవ్ర భంగం వాటిల్లినట్టేనని ఎన్హెచ్ఆర్సీ వివరించింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకన్నారో వివరిస్తూ నివేదికను నాలుగు వారాల్లో అందించాలని రాజస్థాన్ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.
తాజా పరిణామాలపై రాజస్థాన్ పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసింది ఎన్హెచ్ఆర్సీ. నిందితులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ నివేదికను అందించాలని స్పష్టం చేసింది. ఘటనలను నిలువరించడంలో అశ్రద్ధ వహించిన అధికారులపై ఎలాంటి చర్యలు చేపట్టారో కూడా వివరించాలని పేర్కొంది.
క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు ఎన్హెచ్ఆర్సీ రంగంలోకి దిగింది. రాజస్థాన్లో పర్యటించి.. అక్కడి పరిస్థితులపై మూడు నెలల్లో నివేదికను అందించాలని ఓ అధికారికి చెప్పింది.
సంబంధిత కథనం