Crime news : 3ఏళ్ల బాలికపై అత్యాచారం- నిందితుల్లో ముగ్గురి వయస్సు 7ఏళ్లు!-girl raped in ups basti 3 boys aged 6 7 booked ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : 3ఏళ్ల బాలికపై అత్యాచారం- నిందితుల్లో ముగ్గురి వయస్సు 7ఏళ్లు!

Crime news : 3ఏళ్ల బాలికపై అత్యాచారం- నిందితుల్లో ముగ్గురి వయస్సు 7ఏళ్లు!

Sharath Chitturi HT Telugu
Dec 29, 2024 06:40 AM IST

UP rape case : యూపీలో 3ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో పోలీసులు మొత్తం 8 మందిని అరెస్ట్​ చేశారు. వీరిలో ముగ్గురి వయస్సు 7ఏళ్లలోపే ఉండటం గమనార్హం!

3ఏళ్ల బాలికపై అత్యాచారం!
3ఏళ్ల బాలికపై అత్యాచారం!

ఉత్తర్​ప్రదేశ్​లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బస్తి జిల్లాలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది. పోలీసులు నిందితులను పట్టుకోగా.. వారిలో ముగ్గురి వయస్సు 7ఏళ్లు కూడా దాటలేదని తేలింది!

yearly horoscope entry point

ఇదీ జరిగింది..

బస్తీ జిల్లాలో మూడేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం సృష్టించింది. ఈ విషయంపై బాధితురాలి తల్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అనంతరం ఈ నేరానికి పాల్పడిన 6-7 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురు సహా ఎనిమిది మందిపై ఉత్తర్​ప్రదేశ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.

భారతీయ న్యాయ సంహిత, పోక్సో చట్టంలోని సెక్షన్లు 70 (2) (మైనర్​పై సామూహిక అత్యాచారం), 191 (2) (బలవంతపు హింస), 115 (2) (స్వచ్ఛందంగా గాయపరచడం), 152 (ఉద్దేశపూర్వకంగా ఐక్యతకు భంగం కలిగించడం) కింద ఎనిమిది మందిపై శుక్రవారం కేసులు నమోదు చేసినట్లు హరియా పోలీస్ సర్కిల్ ఆఫీసర్ సంజయ్ సింగ్ తెలిపారు. నిందితుల్లో ముగ్గురు బాలురు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారని తెలిపారు.

బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించారు. గురువారం సాయంత్రం అంగన్ వాడీలో ఒంటరిగా ఉన్న సమయంలో బాలికపై బాలురు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఘటన సమయంలో బాలిక కేకలు పెట్టడంతో స్థానికులు ఆక్కడికి వస్తుండటం చూసి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు.

ఎఫ్ఐఆర్ ప్రకారం.. బాలిక తల్లి ఈ సంఘటన గురించి ఫిర్యాదు చేయడానికి అబ్బాయిల తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. కానీ వారందరు ఆమెను కొట్టారు. ఆ తర్వాత బాధితురాలి తల్లి 112కు ఫోన్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్​లు వెల్లువెత్తాయి.

మైనర్లపై అత్యాచారం..

మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పుణె జిల్లాలో 8, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు మైనర్ సోదరీమణులపై లైంగిక దాడి చేసి హత్య చేసిన 54 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

“పశ్చిమ్ ​బెంగాల్​కు చెందిన అజయ్ దాస్ అనే వ్యక్తి ఓ చిన్న రెస్టారెంట్​లో వంటమనిషిగా పనిచేస్తున్నాడు. దాస్ బాధిత కుటుంబం నివాసముంటున్న పక్కన ఇంట్లో ఉంటాడు. ఇద్దరు మైనర్ సోదరీమణులు కనిపించడం లేదంటూ బుధవారం మాకు ఫిర్యాదు అందింది. అనంతరం వారి ఇంటి సమీపంలో నీటిని నిల్వ చేయడానికి ఉపయోగించే డ్రమ్ములో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి,” అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

దాస్ మొదట చిన్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అక్క.. చెల్లిని వెతుక్కుంటూ వెళ్లగా ఆమెను కూడా టార్గెట్ చేశాడని వివరించారు. దాస్ ఇద్దరు అక్కాచెల్లెళ్లను కూడా చంపాడని అధికారులు తెలిపారు.

“దాస్ గురువారం రైలు ద్వారా పారిపోయేందుకు ప్లాన్ చేస్తున్నట్లు మాకు సమాచారం అందింది. పుణె నగరానికి సమీపంలోని ఓ హోటల్లో మా బృందం అతన్ని అరెస్టు చేసింది. అతనిపై ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం, హత్య కేసు నమోదు చేశాము,” అని అధికారులు తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.