Girl gang-raped in school washroom; స్కూళ్లో 11 ఏళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్
Girl gang-raped in school washroom; 11 ఏళ్ల చిన్నారి గ్యాంగ్ రేప్ కు గురైన ఘటన ఢిల్లీలోని ఒక పాఠశాలలో చోటు చేసుకుంది.స్కూల్ వాష్ రూమ్ లో ఈ దారుణం జరిగింది.
Girl gang-raped in school washroom; ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో 11 ఏళ్ల విద్యార్థినిపై ఆమె సీనియర్లు ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. పాఠశాల వాష్ రూమ్ లోనే వారు ఈ దారుణానికి ఒడిగట్టారు.
ట్రెండింగ్ వార్తలు
Girl gang-raped in school washroom; జులై లోనే ఈ దారుణం..
ఈ దారుణం జులై నెలలోనే జరిగింది. కానీ బాధితురాలి కుటుంబం ఈ మంగళవారం పోలీసులను ఆశ్రయించి, జరిగిన దారుణాన్ని వివరించింది. ఈ ఘటనపై ఢిల్లీ కమిషన్ ఫర్ విమన్(DCW), కేంద్రీయ విద్యాలయ సంఘటన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఆదేశించింది. మరోవైపు, (DCW) కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. ఈ దారుణంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని స్కూల్ యాజమాన్యాన్ని, పోలీసులను ఆదేశించింది. ఈ ఘటన జరగగానే వెంటనే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది.
Girl gang-raped in school washroom; టీచర్ నిర్వాకం
గ్యాంగ్ రేప్ ఘటన తరువాత, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని బాధిత బాలికతో ఆమె క్లాస్ టీచర్ చెప్పిందని, దాంతో ఆ బాలిక ఆ దారుణాన్ని తన కుటుంబ సభ్యులకు కూడా చాలా రోజులు చెప్పలేదని DCW చైర్ పర్సన్ స్వాతి మలివాల్ వెల్లడించారు. ఆ బాలిక తన క్లాస్ రూమ్ కు వెళ్తుండగా, 11, 12 వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బలవంతంగా ఆ బాలికను వాష్ రూమ్ కు తీసుకువెళ్లి అత్యాచారం చేశారని స్వాతి తెలిపారు.