Crime news: రాజస్థాన్ లోని డీగ్ జిల్లాలో 16 ఏళ్ల బాలికను ముగ్గురు దుండగులు తుపాకీతో బెదిరించి, అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. టాయిలెట్ కు వెళ్లడం కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ బాలికను ముగ్గురు వ్యక్తులు తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేశారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
నిందితులు ఆమెను తన ఇంటి ముందు నుంచి కిడ్నాప్ చేశారు. ఆమెను బలవంతంగా దగ్గర్లోని పంట పొలానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుడు ఈ నేరాన్ని మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేశారని, ఈ విషయం బయటకు చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించారని పోలీసులు తెలిపారు. వారు ఈ నేరానికి పాల్పడుతుండగా, సమీపంలో తన పంటకు నీరు పడ్తున్న ఓ వ్యక్తి బాలిక అరుపులు విని ఆమెను కాపాడేందుకు పరుగెత్తాడు. అతడు ఘటనాస్థలికి చేరుకునే సరికి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. వారు తమ మోటార్ సైకిల్ ను, బూట్లను అక్కడే వదిలేసి పరారయ్యారు.
బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. ఈ గ్యాంగ్ రేప్ కు సంబంధించి పొక్సొ (pocso act) చట్టం, లైంగిక దాడిని చిత్రీకరించినందుకు ఐటీ చట్టం, బాలికను కిడ్నాప్ చేసినందుకు భారతీయ న్యాయ సంహిత కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.