Crime news : 8ఏళ్ల బాలిక రేప్- హత్య.. నిందితుడి వయస్సు 13ఏళ్లు!
Boy kill girl in Ghaziabad : ఓ 13ఏళ్ల బాలుడు.. 8ఏళ్ల బాలికను రేప్ చేసి చంపేశాడు. మృతదేహాన్ని దాచిపెట్టేందుకు తన 11ఏళ్ల సోదరుడి సాయం తీసుకున్నాడు.
Ghaziabad crime news : ఘజియాబాద్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 8ఏళ్ల బాలికను.. ఆమె బంధువు రేప్ చేసి, చంపేశాడు. అతని వయస్సు 13ఏళ్లు! మృతదేహాన్ని మాయం చేసేందుకు.. ఆ బాలుడు.. తన 11ఏళ్ల సోదరుడి సాయం తీసుకున్నాడు. ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది.

ఇదీ జరిగింది..
బాధితురాలిపై 13ఏళ్ల బాలుడు.. నెల రోజు క్రితం లైంగిక దాడి చేశాడు. ఆ విషయాన్ని ఆ బాలిక.. కొన్ని రోజుల క్రితం.. బాలుడి తండ్రికి చెప్పింది. కోపంతో.. బాలుడిని కొట్టాడు అతని తండ్రి. ఫలితంగా.. బాలికపై 13ఏళ్ల బాలుడికి కోపం పెరిగింది.
ఈ నేపథ్యంలో.. ఈ నెల 20న బాలుడు.. బాలికను ఎవరూ లేని ఒక స్టోర్‌రూమ్‌కి తీసుకెళ్లాడు. ఆమెను రేప్ చేశాడు. అరిచేందుకు ఆ 8ఏళ్ల బాలిక ప్రయత్నించగా.. ఆమె తలపై ఇటుకటో కొట్టాడు. ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని మాయం చేయాలని నిర్ణయించుకున్న ఆ 13ఏళ్ల బాలుడు.. తన సోదరుడికి కాల్ చేశాడు. అతని వయస్సు 11ఏళ్లు! ఇద్దరు కలిసి.. బాలిక మృతదేహాన్ని సమీపంలోని డ్రైనేజ్‌లో పడేసి వెళ్లిపోయారు.
బాలిక కనిపించకుండా పోవడంతో.. ఆమె కుటుంబసభ్యులు వెతకడం మొదలుపెట్టారు. కానీ ఆరోజు బాలిక దొరకలేదు. మరుసటి రోజు.. 11ఏళ్ల బాలుడు.. ఓ కట్టుకథ అల్లి.. కుటుంబసభ్యులు, స్థానికులను డ్రైనేజ్ దగ్గరికి తీసుకెళ్లాడు.
Boy rapes girl : "ఓ 65ఏళ్ల వ్యక్తి.. డ్రైనేజ్‌లో బాడి దొరుకుతుందని, చూడమని చెప్పాడు. ఆయన ఎవరో నాకు తెలియదు," అని ఆ బాలుడు.. అందరికి చెప్పాడు. డ్రైనేజ్‌లో బాలిక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా.. అసలు బాలిక మృతదేహాన్ని మొదట ఎవరు చూశారు? అని స్థానికులను ప్రశ్నించారు. వారు.. ఆ 11ఏళ్ల బాలుడిని చూపించారు. అతను మళ్లీ.. అదే కట్టుకథ పోలీసులకు చెప్పాడు. కానీ పోలీసులకు నమ్మకం కుదరలేదు. చివరికి.. ఆ 11ఏళ్ల బాలుడిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అతను జరిగినదంతా చెప్పేశాడు.
Boy rapes 8 year old girl : మరోవైపు.. 13ఏళ్ల ప్రధాన నిందితుడు.. ఘజియాబాద్ నుంచి 17కి.మీల దూరంలోనే తన తాత ఇంటికి వెళ్లిపోయాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లారు. చివరికి.. అతడిని పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయలో.. 13ఏళ్ల బాలుడు బాగా ఏడిచాడు. జరిగినది వివరించాడు.
నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు.. బాలికపై లైంగిక దాడి జరిగిందని పోస్టుమార్టం నివేదికలో తేలింది.
సంబంధిత కథనం