free OTT subscription: జియో ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ సహా ఓటీటీ యాప్స్ ఫ్రీ-get free netflix amazon prime disney hotstar subscription with these 3 jio plans ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Free Ott Subscription: జియో ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ సహా ఓటీటీ యాప్స్ ఫ్రీ

free OTT subscription: జియో ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ సహా ఓటీటీ యాప్స్ ఫ్రీ

HT Telugu Desk HT Telugu

free OTT subscription: ఈ జియో ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ఓటీటీ యాప్స్ ఫ్రీగా చూసేయొచ్చు. 150 జీబీ డేటా కూడా వస్తోంది.

Jio post-paid plans: ఓటీటీలకు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ అవకాశం కల్పించే జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్లు (Bloomberg)

free OTT subscription: రిలయన్స్ జియో మూడు విభిన్న ప్లాన్లను అందిస్తోంది. ఈసారి ఎంటర్‌టైన్మెంట్ ఫోకస్‌గా విభిన్న ఆఫర్లు అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి యాప్‌లకు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది.

అంతేకాకుండా 150 జీబీ డేటా, అన్‌లిమిడెట్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ రూ. 399, రూ. 599, రూ. 799 ప్లాన్లలో ఈ సౌకర్యాలు అన్నీ ఉన్నాయి.

జియో రూ. 399 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఇలా..

జియో రూ. 399 పోస్ట్ పెయిడ్ ప్లాన్ 75 జీబీ ఇంటర్నెట్ డేటా అందిస్తోంది. ఈ డేటా లిమిట్ అయిపోతే యూజర్లు 1 జీబీకి రూ. 10 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మిగిలిపోతే 200 జీబీ వరకు రోల్ అవర్ అవుతుంది. ఈ ప్లానులో అన్‌లిమిటెడ్ కాలింగ్.. అంటే కాల్స్‌పై ఎలాంటి పరిమితి లేదు. రోజుకు 100 సంక్షిప్త సందేశాలు కూడా పంపుకోవచ్చు. ఈ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ యాప్స్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

జియో రూ. 599 పోస్ట్ పెయిడ్ ప్రయోజనాలు ఇవీ..

జియో రూ. 500 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ద్వారా నెలకు 100 జీబీ డేటా అందుకోవచ్చు. ఒక నెలలో డేటా మిగిలితే 200 జీబీ వరకూ రోల్ అవర్ అవుతుంది. డేటా పరిమితి అయిపోతే 1 జీబీకి రూ. 10 చొప్పున చెల్లించాలి. రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ పంపుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి ఓటీటీలకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది.

జియో రూ. 799 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు ఇవీ..

జియో రూ. 799 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో నెలకు 150 జీబీ డేటా ఉంటుంది. డేటా మిగిలిపోతే 200 జీబీ వరకు రోల్ ఓవర్ అయి ఉంటుంది. ఒక వేళ డేటా అయిపోతే ఒక్కో జీబీకి రూ. 10 చెల్లించి కొనుగోలు చేయొచ్చు. 100 ఎస్ఎంఎస్ ఉచితం. అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. అదనంగా మీ కుటుంబ సభ్యల కోసం 2 సిమ్ కార్డులు ఇస్తారు. ఈ ప్లాన్‌లో కూడా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో తదితర యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.