PMO vs Gehlot: ‘నా ప్రసంగం తొలగించారు.. పీఎం మోదీ ప్రొగ్రామ్ కు నేను రాను’- రాజస్తాన్ సీఎం గహ్లోత్, పీఎంఓల ట్విటర్ వార్-gehlot says his speech at modis rajasthan event cancelled pmo says not true ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Gehlot Says His Speech At Modi's Rajasthan Event Cancelled, Pmo Says Not True

PMO vs Gehlot: ‘నా ప్రసంగం తొలగించారు.. పీఎం మోదీ ప్రొగ్రామ్ కు నేను రాను’- రాజస్తాన్ సీఎం గహ్లోత్, పీఎంఓల ట్విటర్ వార్

HT Telugu Desk HT Telugu
Jul 27, 2023 01:28 PM IST

PMO vs Gehlot: ప్రధాని మోదీ రాజస్తాన్ పర్యటన సందర్భంగా ప్రధాని కార్యాలయం, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రధాని కార్యక్రమంలో తన ప్రసంగాన్ని తొలగించారని, అందువల్ల తాను ఆ కార్యక్రమానికి హాజరు కావడం లేదని బుధవారం ఉదయం గహ్లోత్ ట్వీట్ చేశారు.

ప్రధాని మోదీతో రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ (ఫైల్ ఫొటో)
ప్రధాని మోదీతో రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ (ఫైల్ ఫొటో)

PMO vs Gehlot: ప్రధాని మోదీ రాజస్తాన్ పర్యటన సందర్భంగా ప్రధాని కార్యాలయం, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రధాని కార్యక్రమంలో తన ప్రసంగాన్ని తొలగించారని, అందువల్ల తాను ఆ కార్యక్రమానికి హాజరు కావడం లేదని బుధవారం ఉదయం గహ్లోత్ ట్వీట్ చేశారు. ఆ ప్రసంగంలో తాను అగ్నివీర్ స్కీమ్ రద్దు, రుణమాఫి డిమాండ్.. తదితర అంశాలను లేవనెత్తాలనుకున్నానని వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

నా ప్రసంగం తొలగిస్తారా?

ప్రధాని మోదీ బుధవారం రాజస్తాన్ లో పర్యటిస్తున్నారు. అక్కడ సికర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పాల్గొనాలి. అయితే, ఆ కార్యక్రమంలో తన మూడు నిమిషాల ప్రసంగాన్ని తొలగించారని, అందువల్ల ఆ కార్యక్రమానికి హాజరు కావడం లేదని అశోక్ గహ్లోత్ బుధవారం ఉదయం ట్వీట్ చేశారు. ఆ ప్రసంగంలో తాను అగ్నివీర్ స్కీమ్ రద్దు, రుణమాఫి డిమాండ్.. తదితర అంశాలను లేవనెత్తాలనుకున్నానని వెల్లడించారు. ‘ నా ప్రసంగాన్ని తొలగించినందువల్ల, నేను స్వయంగా మీకు స్వాగతం పలకలేకపోతున్నా. అందుకే ఈ ట్వీట్ ద్వారా స్వాగతం పలుకుతున్నా’ అని ఆ ట్వీట్ లో పీఎం మోదీ ని ఉద్దేశించి గహ్లోత్ వ్యాఖ్యానించారు. గత ఆరు నెలల్లో ప్రధాని మోదీ ఏడు సార్లు రాజస్తాన్ కు వచ్చిన విషయాన్ని కూడా గహ్లోత్ ప్రస్తావించారు. త్వరలో రాజస్తాన్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

మీ ప్రసంగం తొలగించలేదు..

రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ ట్వీట్ కు ప్రధాని కార్యాలయం స్పందించింది. ప్రధాని మోదీ కార్యక్రమంలో రాజస్తాన్ సీఎం గహ్లోత్ ప్రసంగాన్ని తొలగించలేదని, కాలికి గాయమైనందువల్ల గహ్లోత్ ఆ కార్యక్రమానికి రావడం లేదని తమకు సీఎంఓ నుంచి సమాచారం వచ్చిందని పీఎంఓ వెల్లడించింది.ప్రధాని మోదీ పాల్గొంటున్న కార్యక్రమ షెడ్యూల్ లో సీఎం గహ్లోత్ ప్రసంగం కూడా ఉందని స్పష్టం చేసింది. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలపై కూడా ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పేరు ఉందని తెలిపింది. గతంలో రాజస్తాన్ లో ప్రధాని మోదీ పాల్గొన్న అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎంగా అశోక్ గహ్లోత్ పాల్గొని, ప్రసంగించిన విషయాన్ని పీఎంఓ గుర్తు చేసింది.

తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.