Gautam Adani slips to 3rd spot: మళ్లీ మూడో స్థానానికి ఆదానీ-gautam adani slips to 3rd spot in global billionaires list ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gautam Adani Slips To 3rd Spot: మళ్లీ మూడో స్థానానికి ఆదానీ

Gautam Adani slips to 3rd spot: మళ్లీ మూడో స్థానానికి ఆదానీ

HT Telugu Desk HT Telugu
Sep 27, 2022 04:41 PM IST

Gautam Adani slips to 3rd spot: ప్రపంచ సంపన్నుల జాబితాలో భారతీయ సంపన్న వ్యాపారి గౌతమ్ ఆదానీ స్థానం కొంత తగ్గింది.

గౌతమ్ ఆదానీ
గౌతమ్ ఆదానీ (ANI)

Gautam Adani slips to 3rd spot: బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయారు. ఆమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఆదానీని దాటేసి రెండో స్థానంలోకి దూసుకువెళ్లారు.

Gautam Adani slips to 3rd spot: డైలీ ఇండెక్స్..

బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రతీ రోజు ట్రేడింగ్ టైమ్ ముగిసిన తరువాత బిలియనీర్ల సంపదను లెక్కగట్టి ఒక జాబితాను విడుదల చేస్తుంది. తాజా జాబితాలో 245 బిలియన్ డాలర్ల సంపదతో టెస్లా చీఫ్ ఇలాన్ మస్క్ తొలి స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న గౌతమ్ ఆదానీ 135 బిలియన్ డాలర్ల సంపదతో మూడో ప్లేస్ కు, మూడో ప్లేస్ లో ఉన్న బెజోస్ 138 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానానికి మారారు.

Gautam Adani slips to 3rd spot: ముకేశ్ అంబానీ స్థానం?

ఇన్నాళ్లూ ప్రపంచ సంపన్నుల జాబితాలో టాప్ టెన్ లో ఉన్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. తాజాగా ఆ హోదా కోల్పోయారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆయన ప్రస్తుత స్థానం 11. ముకేశ్ అంబానీ సంపద 82.4 బిలియన్ డాలర్లు. రానున్న పదేళ్లలో గౌతమ్ ఆదానీ ఎనర్జీ, డేటా సెంటర్స్.. తదితర రంగాల్లో 100 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టునున్నట్లు సమాచారం.

టీ20 వరల్డ్ కప్ 2024