GATE 2025: గేట్ 2025 కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్; అప్లై చేశారా?-gate 2025 registration process without late fee ends tomorrow how to apply ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gate 2025: గేట్ 2025 కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్; అప్లై చేశారా?

GATE 2025: గేట్ 2025 కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్; అప్లై చేశారా?

Sudarshan V HT Telugu
Sep 25, 2024 07:35 PM IST

లేట్ ఫీజుతో గేట్ 2025 కి అప్లై చేయడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 26, 2024. ఆలస్య రుసుముతో అక్టోబర్ 7, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు అప్లై చేయని విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ gate2025.iitr.ac.in ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

గేట్ 2025 కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్
గేట్ 2025 కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2025 (GATE 2025) కి దరఖాస్తు చేసుకునే గడువు రేపటితో ముగుస్తుంది. ఈ పరీక్షను రూర్కీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహిస్తోంది. ఆలస్య రుసుము లేకుండా గేట్ 2025 కి సెప్టెంబర్ 26వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో అక్టోబర్ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. గేట్ 2025 కి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఐఐటీ రూర్కీ గేట్ అధికారిక వెబ్సైట్ gate2025.iitr.ac.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

గేట్ 2025 కి ఇలా అప్లై చేయండి

గేట్ 2025 పరీక్షకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.

  • ముందుగా ఐఐటీ గేట్ అధికారిక వెబ్సైట్ gate2025.iitr.ac.in ను ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న గేట్ 2025 రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
  • వివరాలు నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలి.
  • ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ నింపి అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
  • ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • సబ్మిట్ పై క్లిక్ చేసి కన్ఫర్మేషన్ పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
  • తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.

అవసరమైన డాక్యుమెంట్లు

గేట్ 2025 కి దరఖాస్తు చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు

  • ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా అభ్యర్థి ఫొటో.
  • ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా అభ్యర్థి సంతకం.
  • అవసరమైతే కేటగిరీ సర్టిఫికేట్ (ఎస్సీ/ఎస్టీ) స్కాన్ కాపీని పీడీఎఫ్ లో అప్ లోడ్ చేయాలి.
  • ఒకవేళ వర్తిస్తే పీడీఎఫ్ లో పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ స్కాన్ కాపీ ని అప్ లోడ్ చేయాలి.
  • ఒకవేళ వర్తించినట్లయితే, డిస్లెక్సియా సర్టిఫికేట్ స్కాన్డ్ కాపీని PDFలో అప్ లోడ్ చేయాలి.
  • చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడి స్కాన్డ్ కాపీ: ఉదాహరణకు ఆధార్/ పాస్ పోర్ట్ / పాన్ కార్డ్ / ఓటర్ ఐడీ / డ్రైవింగ్ లైసెన్స్.

అప్లికేషన్ ఫీజు

గేట్ 2025 (GATE 2025) కి దరఖాస్తు చేసే మహిళా/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు రూ.900/- దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఇతర అభ్యర్థులు రూ.1800 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు గేట్ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.