GATE 2024: ‘గేట్ 2024’ వెబ్ సైట్ లాంచ్ అయింది.. సైట్ లో రిజిస్ట్రేషన్స్, ఎగ్జామ్ డేట్స్ వివరాలు..
GATE 2024: గేట్ 2024 పరీక్షకు సంబంధించిన వెబ్ సైట్ ను శనివారం ప్రారంభించారు. ఈ పరీక్షకు హాజరవ్వాలనుకుంటున్న విద్యార్థులు ఈ gate2024.iisc.ac.in వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్స్ ఆగస్ట్ 24 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది.
GATE 2024: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ - గేట్ (Graduate Aptitude Test in Engineering GATE) 2024 పరీక్షకు సంబంధించిన వెబ్ సైట్ ను శనివారం ప్రారంభించారు. ఈ పరీక్షకు హాజరవ్వాలనుకుంటున్న విద్యార్థులు ఈ gate2024.iisc.ac.in వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్స్ ఆగస్ట్ 24 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది.
ట్రెండింగ్ వార్తలు
ఫిబ్రవరి 3 నుంచి పరీక్షలు
గేట్ 2024 పరీక్షను బెంగళూరు లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) నిర్వహిస్తుంది. గేట్ 2024 పరీక్షకు రిజిస్ట్రేషన్లను ఈ నెల 24 నుంచి ప్రారంభించాలని భావిస్తోంది. ఈ దిశగా మొదట gate2024.iisc.ac.in పేరుతో వెబ్ సైట్ ను ప్రారంభించింది. గేట్ 2024 పరీక్షలు 2024, ఫిబ్రవరి 3 వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఆ వెబ్ సైట్ డిస్ ప్లే లో ఉంది. గేట్ 2024 పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను కూడా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు.
2024 నుంచి మరో కొత్త పేపర్
2024 సంవత్సరం నుంచి గేట్ పరీక్షల్లో మరో కొత్త పేపర్ ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. గేట్ 2024 నుంచి డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (DA and AI) సబ్జెక్టులో కూడా పరీక్ష ఉంటుందని ఐఐఎస్సీ ప్రకటించింది. గేట్ 2024 పరీక్ష 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో రెండు షిఫ్ట్ ల్లో ఉంటుందని తెలిపింది. మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12. 30 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుందని వివరించింది. బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, బీఎస్ఎన్ఎల్, కోల్ ఇండియా లిమిటెడ్, సీఆర్ఐఎస్, ఈసీఐఎల్, నాల్కో.. తదితర ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోర్ ఆధారంగా తమ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. అలాగే, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరేట్ ప్రొగ్రామ్స్ లో ఈ స్కోర్ ఆధారంగానే ప్రముఖ విద్యాసంస్థలు స్కాలర్ షిప్ తో కూడిన అడ్మిషన్లను కల్పిస్తాయి.