GATE 2024 results : అలర్ట్.. ఇంకొన్ని రోజుల్లో గేట్ 2024 ఫలితాలు విడుదల..
GATE 2024 results when : గేట్ 2024 ఫలితాలు.. ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ అవ్వనున్నాయి. ఫలితాలను ఐఐఎస్సీ బెంగళూరు విడుదల చేయనుంది. ఆ వివరాలు..
GATE 2024 results date : గేట్ 2024 ఫలితాలపై కీలక అప్డేట్! బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ).. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్ 2024) ఫలితాలను మార్చ్ 16న విడుదల చేయనుంది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు.. gate2024.iisc.ac.in అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. గేట్ 2024 ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ (జీఓఏపీఎస్) పోర్టల్లో అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు.
ఫలితాలతో పాటు కటాఫ్ వివరాలను కూడా ఐఐఎస్సీ బెంగళూరు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అభ్యర్థులు పరిశీలించాలి.
ఇదీ చూడండి:- RRB Technician Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 9వేల పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ!
GATE 2024 results when : గేట్ 2024 పరీక్ష.. 2024 ఫిబ్రవరి 3 నుంచి 11 వరకు జరిగింది. మార్చ్ 16న ఫలితాలు వెలువడిన తర్వాత.. అభ్యర్థులు మార్చ్ 23 నుంచి మే 31, 2024 వరకు స్కోర్ కార్డులను జీఓపీఎస్ పోర్టల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వాలిడ్ గేట్ స్కోర్ ఉన్న అభ్యర్థులు ఇంజనీరింగ్ / టెక్నాలజీ / సైన్స్ / ఆర్కిటెక్చర్ / హ్యుమానిటీస్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లు, డైరెక్ట్ డాక్టోరల్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందవచ్చు. అలాగే విద్యా మంత్రిత్వ శాఖ, ఇతర ప్రభుత్వ సంస్థల మద్దతు ఉన్న సంస్థల్లో ఇంజనీరింగ్ / టెక్నాలజీ / సైన్స్ / ఆర్కిటెక్చర్ / హ్యుమానిటీస్ సంబంధిత బ్రాంచీల్లో డాక్టోరల్ ప్రోగ్రామ్‌లను పొందవచ్చు.
ఈ గేట్ స్కోర్ కార్డు గరిష్ఠంగా మూడేళ్ల పాటు పనిచేస్తుంది. ఆ తర్వాత మళ్లీ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
How to check GATE 2024 results : మరోవైపు.. ప్రొవిజనల్ గేట్ 2024 ఆన్సర్ కీని ఇప్పటికే రిలీజ్ చేసింది ఐఐఎస్సీ బెంగళూరు. ఫిబ్రవరి 19న.. ఆన్సర్ కీని సైతం విడుదల చేసింది. గేట్ 2024 పరీక్షకు హాజరైన అభ్యర్థులు.. ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కౌన్సిలింగ్‌కి సంబంధించిన వివరాలను ఐఐఎస్సీ బెంగళూరు వెల్లడించాల్సి ఉంది. గేట్ 2024 ఫలితాలు విడుదలైన తర్వాత.. దీనిపై ఓ క్లారిటీ వస్తుంది.
సంబంధిత కథనం