GATE 2024: ‘గేట్ 2024’ కి రిజిస్ట్రేషన్స్ ప్రారంభం; ఇలా అప్లై చేయండి..
GATE 2024: గేట్ 2024 పరీక్షల రిజిస్ట్రేషన్ ఆగస్ట్ 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 2024 సంవత్సరం గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (Graduate Aptitude Test in Engineering GATE) ను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (Indian Institute of Science) నిర్వహిస్తోంది.
GATE 2024: గేట్ 2024 పరీక్షల రిజిస్ట్రేషన్ ఆగస్ట్ 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 2024 సంవత్సరం గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (Graduate Aptitude Test in Engineering GATE) ను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (Indian Institute of Science) నిర్వహిస్తోంది. గేట్ 2024 పరీక్ష 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో జరుగుతుంది. ఈ పరీక్ష ఫలితాలు 2024 మార్చి 16వ తేదీన విడుదలవుతాయి. గేట్ 2024 కు హాజరవాలనుకునే విద్యార్థులు gate2024.iisc.ac.in వెబ్సైట్ ద్వారా ఆగస్ట్ 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గేట్ 2024 పరీక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థుల అడ్మిట్ కార్డ్స్ 2024, జనవరి 3వ తేదీన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు.
ట్రెండింగ్ వార్తలు
ఎంటెక్ అడ్మిషన్స్..
గేట్ పరీక్షలో మంచి స్కోర్ సాధించడం ద్వారానే ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్ లేదా ఎంఈ కోర్సుల్లో అడ్మిషన్ లభిస్తుంది. అలాగే పీజీ స్కాలర్షిప్ కూడా గేట్ స్కోర్ ఆధారంగానే ఇస్తారు. గేట్ పరీక్షకు అప్లై చేసే విద్యార్థులు ఇంజనీరింగ్ లో కానీ, టెక్నాలజీలో కానీ, ఆర్కిటెక్చర్ లో కానీ, సైన్స్ లేదా కామర్స్ లేదా ఆర్ట్స్ లో కానీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇంజనీరింగ్ కోర్స్ మూడో సంవత్సరంలో ఉన్న వారు కూడా గేట్ కి అప్లై చేసి ఎగ్జామ్ రాయవచ్చు.
రిజిస్ట్రేషన్ ఎలా?
అప్లై చేసుకోవడం కోసం విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ gate2024.iisc.ac.in ను ఓపెన్ చేయాలి. హోం పేజ్ లో కనిపించే ‘GATE ONLINE APPLICATION’ లింక్ పై క్లిక్ చేయాలి. మరో విండో ఓపెన్ అవుతుంది. అందులోని అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేసి, ఫీజు చెల్లించి సబ్మిట్ బటన్ నొక్కాలి.
ఈ డేట్స్ గుర్తుంచుకోండి
గేట్ 2024 అప్లై చేసే విద్యార్థులు ఈ డేట్స్ ను గుర్తుంచుకోవాలి..
- గేట్ 2024 అప్లై చేయడానికి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 29, 2023. (లేట్ ఫీజు లేకుండా)
- గేట్ 2024 అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అక్టోబర్ 13, 2023. (లేట్ ఫీజు తో)
- గేట్ అప్లికేషన్ ఫామ్ లో తప్పులు సరిదిద్దడానికి నవంబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు అవకాశం ఇస్తారు.
- అడ్మిట్ కార్డ్స్ జనవరి 3 వ తేదీ నుంచి వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయి.
- గేట్ 2024 పరీక్షలు 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో జరుగుతాయి.
- గేట్ 2024 ఆన్సర్ కీ ఫిబ్రవరి 16వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది.
- ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు ఆన్సర్ కీ పై విద్యార్థులు అభ్యంతరాలను తెలియజేయవచ్చు.
- గేట్ 2024 ఫలితాలు మార్చి 16న వెలువడుతాయి.
- మార్చి 23 నుంచి స్కోర్ కార్డ్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.