GATE 2024 registration : 2024 గేట్ రిజిస్ట్రేషన్ వాయిదా.. ఎప్పుడు మొదలవుతుంది?
GATE 2024 registration : 2024 గేట్ పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డేట్ వాయిదా పడింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
GATE 2024 registration : 2024 గేట్ (గ్రాడ్జ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్) కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులకు కీలక అప్డేట్! ఈ దఫా రిజిస్ట్రేషన్ డేట్ వాయిదా పడింది. ఆగస్ట్ 30న.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఈ దఫా గేట్ పరీక్షను ఐఐఎస్టీ బెంగళూరు (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్) నిర్వహిస్తోంది. కాగా.. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాస్తవానికి, గురువారం ఓపెన్ అవ్వాల్సి ఉంది. కానీ ఓపెన్ అవ్వలేదు. 30వ తేదీ నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని తెలుస్తోంది. అభ్యర్థులు.. తమ అప్లికేషన్‌ను gate2024.iisc.ac.in లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
GATE 2024 registration date : గతంలో వెలువడిన ప్రకటన ప్రకారం.. 2024 గేట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్ట్ 24న మొదలై.. సెప్టెంబర్ 29తో ముగియాల్సి ఉంది. లేట్ ఫీజ్‌తో అక్టోబర్ 13 వరకు అప్లికేషన్లను స్వీకరిస్తుంది ఐఐఎస్టీ బెంగళూరు. 2024 జనవరి 3న అడ్మిట్ కార్డులు విడుదలవుతాయి. మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా ఓపెన్ అవ్వకపోవడంతో.. ఈ కీలక తేదీల్లో ఏదైనా మార్పులు ఉంటాయా? లేదా? అన్నది చూడాలి. మరోవైపు 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో గేట్ పరీక్షను నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది ఐఐఎస్టీ బెంగళూరు.
ఇండియాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్/ పోస్ట్ గ్రాడ్జ్యూయేషన్ చేసేందుకు.. విద్యార్థులు ఈ గేట్ పరీక్షను రాస్తారు. ఇందులో వచ్చిన స్కోర్ ఆధారంగానే.. ప్రముఖ ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు అడ్మిషన్లు ఇస్తాయి.
GATE 2024 registration last date : ఇంజినీరింగ్/ టెక్నాలజీ/ సైన్స్/ ఆర్కిటెక్చర్/ హ్యుమానిటీ విభాగాల్లో మూడు, నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్థులు.. ఈ గేట్ పరీక్ష రాసేందుకు అర్హులు.
ఇలా అప్లై చేసుకోండి..
స్టెప్ 1:- ముందుగా gate2024.iisc.ac.in వెబ్సైట్లోకి వెళ్లండి.
స్టెప్ 2:- హోం పేజ్‌లో రిజిస్ట్రేషన్ లింక్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3:- రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవ్వండి. సబ్మీట్ బటన్ ప్రెస్ చేయండి.
GATE 2024 registration fees : స్టెప్ 1:- అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి, అప్లికేష్ ఫీజ్‌ను చెల్లించండి.
స్టెప్ 1:- సబ్మీట్ బటన్ ప్రెస్ చేయండి. కన్ఫర్మ్ పేజ్ వస్తుంది. దానిని డౌన్లోడ్ చేసుకోండి.
సంబంధిత కథనం