GATE 2024: గేట్ 2024 అడ్మిట్ కార్డ్స్ రెడీ.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..-gate 2024 admit card releasing tomorrow heres how to download ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gate 2024: గేట్ 2024 అడ్మిట్ కార్డ్స్ రెడీ.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

GATE 2024: గేట్ 2024 అడ్మిట్ కార్డ్స్ రెడీ.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

HT Telugu Desk HT Telugu
Jan 02, 2024 01:23 PM IST

GATE 2024: గేట్ 2024 కు అప్లై చేశారా? ఈ ఎగ్జామ్ కు సంబంధించిన అడ్మిట్ కార్డ్ జనవరి 3, 2024న అప్ లోడ్ అవుతున్నాయి. ఈ అడ్మిట్ కార్డ్స్ ను అధికారిక వెబ్ సైట్ gate2024.iisc.ac.in వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

GATE 2024: గేట్ 2024 పరీక్షను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (Indian Institute of Science) సంస్థ నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు సంబంధించిన (2024) అడ్మిట్ కార్డ్స్ ను ఐఐఎస్సీ 2024 జనవరి 3న విడుదల చేయనుంది. ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఐఐఎస్సీ గేట్ అధికారిక వెబ్ సైట్ gate2024.iisc.ac.in ద్వారా అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.

గేట్ 2024 వివరాలు

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (Graduate Aptitude Test in Engineering GATE) అనేది ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్లోని వివిధ అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి సబ్జెక్టుల్లో సమగ్ర అవగాహన కోసం అభ్యర్థులను అంచనా వేసే జాతీయ స్థాయి పరీక్ష. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఐఐఎస్సీ గేట్ అధికారిక వెబ్ సైట్ ను చూడవచ్చు.

ఫిబ్రవరిలో పరీక్ష

గేట్ 2024 (GATE 2024) పరీక్షను 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో షిఫ్ట్ చొప్పున రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ).

అడ్మిట్ కార్డ్ ను ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.

  • ముందుగా గేట్ 2024 అధికారిక వెబ్ సైట్ gate2024.iisc.ac.in ను ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో కనిపిస్తున్న గేట్ 2024 అడ్మిట్ కార్డు లింక్ పై క్లిక్ చేయండి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
  • సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
  • తదుపరి అవసరాల కోసం అడ్మిట్ కార్డ్ హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.

IPL_Entry_Point