Gate 2023 Results: గేట్ 2023 రిజల్ట్స్ నేడే.. ఎలా చెక్ చేసుకోవచ్చంటే!-gate 2023 results will be out today check your results on gate iitk ac in website ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Gate 2023 Results Will Be Out Today Check Your Results On Gate Iitk Ac In Website

Gate 2023 Results: గేట్ 2023 రిజల్ట్స్ నేడే.. ఎలా చెక్ చేసుకోవచ్చంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 16, 2023 10:38 AM IST

Gate 2023 Results Today: గేట్ 2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Gate 2023 Results: గేట్ 2023 రిజల్ట్స్ నేడే.. ఎలా చెక్ చేసుకోవచ్చంటే!
Gate 2023 Results: గేట్ 2023 రిజల్ట్స్ నేడే.. ఎలా చెక్ చేసుకోవచ్చంటే!

Gate 2023 Results: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) పరీక్ష ఫలితాలు నేడు (మార్చి 16)వెలువడనున్నాయి. గేట్ 2023 (GATE 2023) రిజల్ట్స్‌ను నేటి సాయంత్రం 4 గంటల తర్వాత ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ విడుదల చేస్తుంది. అధికారికంగా ఫలితాలు వెల్లడయ్యాక అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చు. gate.iitk.ac.in వెబ్‍సైట్‍కు వెళ్లి గేట్ 2023 ఫలితాలను అభ్యర్థులు చూడవచ్చు. వివరాలివే.

ట్రెండింగ్ వార్తలు

Gate 2023 Results: గేట్ 2023 ఎంట్రన్స్ టెస్ట్ ఈ ఏడాది ఫిబ్రవరి 4,5,11,12వ తేదీల్లో జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ టెస్ట్ సెంటర్లలో ఈ ప్రవేశ పరీక్ష జరిగింది. ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఫిబ్రవరి 21న వెల్లడైంది. ఫలితాలతో పాటే ఫైనల్ ఆన్సర్ కీ కూడా వెలువడుతుందని అంచనా.

Gate 2023 Results: గేట్ 2023 ఫలితాలను చెక్ చేసుకోండిలా..

  • ముందుగా గేట్ అధికారిక వెబ్‍సైట్ gate.iitk.ac.in లోకి వెళ్లాలి.
  • రిజల్ట్స్ వెల్లడయ్యాక.. అక్కడ గేట్ 2023 రిజల్ట్స్ అనే లింక్ కనిపిస్తుంది.
  • లింక్‍పై క్లిక్ చేశాక లాగిన్ అవ్వాలి.
  • లాగిన్ పూర్తయ్యాక మీ రిజల్ట్స్ కనిపిస్తుంది.

Gate 2023 Results: గేట్ 2023 ఫలితాలు నేడు వెల్లడి కానున్నా.. వ్యక్తిగత స్కోర్ కార్డులు మాత్రం ఈనెల 21వ తేదీన ఐఐటీ కాన్పూర్ విడుదల చేస్తుందని తెలుస్తోంది. ఫలితాలు నేడు చెక్ చేసుకోవచ్చు.

Gate 2023 Results: ఐఐటీలు, ఎన్ఐటీలతో పాటు ఇండియాలోని టాప్ ఇన్‍స్టిట్యూట్‍లలో పోస్టు గ్రాడ్యుయేషన్ ఇంజినీరింగ్, మాస్టర్స్‌లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో గేట్ పరీక్ష నిర్వహణ జరుగుతుంది. ఇంజినీరింగ్, టెక్నాలజీ అర్కిటెక్చర్, సైన్స్, కామర్స్ ఆర్ట్స్ రంగాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు పీజీ, మాస్టర్స్ లో ప్రవేశాల కోసం ఈ గేట్ పరీక్షకు హాజరవుతారు. కేంద్ర ప్రభుత్వం నడిపే సంస్థల్లో (PSUs) ఉద్యోగాల భర్తీకి కూడా గేట్ స్కోరును పరిగణనలోకి వస్తుంది.

IPL_Entry_Point