GATE 2023 admit cards : నేడు 'గేట్'​ అడ్మిట్​ కార్డ్స్​ విడుదల.. ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి-gate 2023 admit cards to be issued today check steps to download ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Gate 2023 Admit Cards To Be Issued Today Check Steps To Download

GATE 2023 admit cards : నేడు 'గేట్'​ అడ్మిట్​ కార్డ్స్​ విడుదల.. ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 03, 2023 08:33 AM IST

GATE 2023 admit cards : 2023 గేట్​ అడ్మిట్​ కార్డ్స్​ నేడు విడుదల కానున్నాయి. ఆ వివరాలు..

నేడు గేట్​ అడ్మిట్​ కార్డ్స్​ విడుదల.. ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి
నేడు గేట్​ అడ్మిట్​ కార్డ్స్​ విడుదల.. ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి

GATE 2023 admit cards : 2023 గేట్​ (గ్రాడ్యుయేట్​ ఆప్టిట్యూడ్​ టెస్ట్​ ఇన్​ ఇంజినీరింగ్​)కు సంబంధించిన అడ్మిట్​ కార్డ్​లను నేడు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది.. గేట్​ పరీక్షను ఐఐటీ కాన్పూర్​ నిర్వహిస్తోంది. 2023 గేట్​ అడ్మిట్​ కార్ట్​.. gate.iitk.ac.in లో రిలీజ్​ అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు

ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో 2023 గేట్​ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూల్​ ప్రకారం.. ఫిబ్రవరి 15 అభ్యర్థులకు సంబంధించిన రెస్పాన్స్​ షీట్​లను అందుబాటులో ఉంచుతారు. ఫిబ్రవరి 21న 2023 గేట్​ కీని విడుదల చేస్తారు. అభ్యంతరాలను తెలియజేసేందుకు ఫిబ్రవరి 22-25 వరకు అవకాశాన్ని కల్పించింది ఐఐటీ కాన్పూర్​.

ఇక 2023 గేట్​ పరీక్షల ఫలితాలను మార్చ్​ 16న విడుదల చేస్తారు.

గేట్​ అడ్మిట్​ కార్డు డౌన్​లోడ్​ చేసుకోండిలా..

Gate 2023 dates : స్టెప్​ 1:- గేట్​ అధారిక వెబ్​సైట్​ అయిన gate.iitk.ac.inకు వెళ్లాలి

స్టెప్​ 2:- 2023 గేట్​ అడ్మిట్​ కార్డ్​కు సంబంధించిన లిక్​ హోం పేజ్​లో ఉంటుంది. ఆ లింక్​ మీద క్లిక్​ చేయాలి.

స్టెప్​ 3:- మీ లాగిన్​ డీటైల్స్​ ఎంటర్​ చేసి సబ్మిట్​ చేయాలి.

స్టెప్​ 4:- మీ అడ్మిట్​ కార్డు.. స్క్రీన్​ మీద కనిపిస్తుంది. దానిని డౌన్​లోడ్​ చేసుకోవాలి.

Gate 2023 schedule : ఇంజినీరింగ్​, టెక్నాలజీ ఆర్కిటెక్చర్​, సైన్స్​, కామర్స్​, ఆర్ట్స్​ రంగాల్లో ప్రవేశాల కోసం ఈ జాతీయ స్థాయి గేట్​ పరీక్షను నిర్వహిస్తారు. మాస్టర్స్​, పోస్ట్​గ్రాడ్జ్యుయేషన్​ కోర్సుల కోసం ఈ గేట్​ స్కోర్​ను చూస్తారు. అంతేకాకుండా.. పలు పీఎస్​యూ ఉద్యోగాల్లోనూ ఈ గేట్​ స్కోర్​కు అధిక ప్రాధాన్యతనిస్తారు. అందుకే ప్రతియేటా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షను రాస్తారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం